రఘురామకృష్ణరాజు విడుదల మరింత ఆలస్యం? కారణం ఏమిటంటే?
ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఇటీవల సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే రఘురామ కృష్ణ రాజు చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు. మొత్తంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. రఘురామ.. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. రఘురామపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నుంచి […]
ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఇటీవల సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే రఘురామ కృష్ణ రాజు చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు.
మొత్తంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. రఘురామ.. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. రఘురామపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఈ ఎంపీకి.. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా మద్దతు ఇవ్వడం గమనార్హం. దీనివెనక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి.
ఎంపీ రఘురామ చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.సొంతపార్టీపైనా ఎన్నో విమర్శలు చేశారు. ఇటీవల సీఎం జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. సీఎం జగన్ కులంపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే రఘురామను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు సుప్రీంలో బెయిల్ కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం రఘురామ హైదరాబాద్లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బెయిల్ వచ్చిందికనుక .. ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళతారని అంతా భావించారు. కానీ కొన్ని న్యాయమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆయన విడుదల మరో నాలుగు రోజులు వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో సోమవారం రఘురామ న్యాయవాదులు ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశారు. కాగా సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్ధితిని గుంటూరు జిల్లా మెజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ సమ్మరీ కావాలని న్యాయమూర్తి అడిగారు. అయితే రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావటానికి మరో నాలుగు రోజులు సమయం పడుతుందని ఆర్మీ వైద్యులు మెజిస్ట్రేట్ కు తెలపటంతో రఘురామ విడుదల వాయిదా పడింది. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటీషన్ వేస్తామని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.సుప్రీంకోర్టు మే 21 న రఘురామకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన ఇంకా విడుదల కాలేదు.