Telugu Global
Cinema & Entertainment

బంగార్రాజు సరసన పాయల్ పాప?

ఇప్పుడిప్పుడే బంగార్రాజు ప్రాజెక్టులో కదలిక వస్తోంది. చాన్నాళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏడాది కిందట స్క్రీన్ ప్లే లాక్ చేశారు. అప్పట్నుంచి కరోనా బెడద పట్టుకుంది. సెకెండ్ వేవ్ ముగిసిన వెంటనే సినిమా సెట్స్ పైకి వచ్చేలా ఉంది. ఇంతలోనే ఈ ప్రాజెక్టుపై సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారట. అయితే హీరోయిన్ గా కాదు. ఓ ఐటెంసాంగ్ కోసం ఆమెను సంప్రదించినట్టు నిన్నట్నుంచి పుకార్లు […]

బంగార్రాజు సరసన పాయల్ పాప?
X

ఇప్పుడిప్పుడే బంగార్రాజు ప్రాజెక్టులో కదలిక వస్తోంది. చాన్నాళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టుకు
సంబంధించి ఏడాది కిందట స్క్రీన్ ప్లే లాక్ చేశారు. అప్పట్నుంచి కరోనా బెడద పట్టుకుంది. సెకెండ్ వేవ్
ముగిసిన వెంటనే సినిమా సెట్స్ పైకి వచ్చేలా ఉంది.

ఇంతలోనే ఈ ప్రాజెక్టుపై సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ను
తీసుకున్నారట. అయితే హీరోయిన్ గా కాదు. ఓ ఐటెంసాంగ్ కోసం ఆమెను సంప్రదించినట్టు
నిన్నట్నుంచి పుకార్లు వస్తున్నాయి.

తనపై ఎప్పుడు ఎలాంటి పుకారు వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతుంది పాయల్. ఈసారి కూడా అదే పని
చేసింది. బంగార్రాజు ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఎవ్వరూ సంప్రదించలేదని
క్లారిటీ ఇచ్చింది.

బంగార్రాజు ప్రాజెక్టును 3 నెలల్లో పూర్తిచేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది నాగార్జున
ప్లాన్. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు.

First Published:  24 May 2021 1:51 PM IST
Next Story