కొత్త వీసీల నియామకం.. అన్నివర్గాలకు ప్రాధాన్యం..!
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించడం లేదని చాలా కాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామకం చేపట్టింది. వీసీల నియామకంలో అన్నివర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించలేదు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వీసీల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెర్చ్‌కమిటీలు వేశారు. యూజీసీ నిబంధనల ప్రకారం.. ఈ కమిటీ ఓ నివేదికను తయారుచేసింది. […]
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించడం లేదని చాలా కాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామకం చేపట్టింది. వీసీల నియామకంలో అన్నివర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించలేదు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో వీసీల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెర్చ్‌కమిటీలు వేశారు. యూజీసీ నిబంధనల ప్రకారం.. ఈ కమిటీ ఓ నివేదికను తయారుచేసింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వీసీల నియామకం చేపట్టింది. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. వీసీల జాబితాను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.
ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరాబాద్) వీసీగా ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ (బీసీ)కు అవకాశం దక్కింది. కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీగా ప్రొఫెసర్ టీ రమేష్ (బీసీ)కు, తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీపీగా ప్రొఫెసర్ డి.రవీందర్ (వైశ్య)కు అవకాశం దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీగా ప్రొఫెసర్ సీతారామారావు (ఓసీ, బ్రాహ్మణ)ను నియమించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీగా టీ. కిషన్ రావు ( ఓసీ, వెలమ) అవకాశం దక్కింది. పాలమూరు యూనివర్సిటీ, (మహబూబ్ నగర్) వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్( ఎస్టీ)కు అవకాశం దక్కింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ (నల్గొండ ) వీసీ గా ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీగా ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి (ఓసీ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్)వీసీగా ప్రొఫెసర్ మల్లేశం (ఎస్సీ మాల), జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీగా కవిత దర్యాని (ఓసీ, సింధి)కి అవకాశం దక్కింది.