ఆర్ఆర్ఆర్.. రూ. 325 కోట్ల డీల్
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మరో బిగ్ డీల్ కుదిరింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో పాటు నార్త్ థియేట్రికల్ రైట్స్ ను పెన్ స్టుడియోస్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంస్థ నుంచి సినిమా హక్కుల్ని జీ గ్రూప్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. పైన చెప్పుకున్న హక్కుల్ని పెన్ స్టుడియోస్ సంస్థ 450 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. వాటి నుంచి డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ సంస్థ 325 కోట్ల […]
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మరో బిగ్ డీల్ కుదిరింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్
రైట్స్ తో పాటు నార్త్ థియేట్రికల్ రైట్స్ ను పెన్ స్టుడియోస్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడీ సంస్థ నుంచి సినిమా హక్కుల్ని జీ గ్రూప్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
పైన చెప్పుకున్న హక్కుల్ని పెన్ స్టుడియోస్ సంస్థ 450 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. వాటి నుంచి
డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ సంస్థ 325 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ
డీల్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ రైట్స్ జీ గ్రూప్
సొంతమయ్యాయి.
అయితే డీల్ ఓకే అయింది కానీ తెలుగు రైట్స్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్ఆర్ఆర్ తెలుగు శాటిలైట్
రైట్స్ కూడా ఈ బల్క్ డీల్ లో ఉన్నాయా.. లేక ఆ రైట్స్ ను పెన్ స్టుడియోస్ సంస్థే ఉంచుకుందా అనేది
తేలాల్సి ఉంది. స్టార్ మా ఛానెల్ భారీ రేటుకు ఓన్లీ తెలుగు శాటిలైట్ రైట్స్ దక్కించుకుందని
చెబుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రాబోతోంది.