సోనూ సూద్ తొలి ఆక్సిజన్ ప్లాంట్.. ఆంధ్రప్రదేశ్‌లోనే..!
కరోనా వేళ .. సోనూ సూద్ ఎవరి ఊహకు అందనంత సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్‌లో ఎందరో వలస కూలీలను సోనూ సూద్ ఆదుకున్నాడు. అనేకమంది పేద ప్రజలకు, ఉపాధి కోల్పోయిన వారికి తనవంతు సాయం చేశాడు. ప్రాంతాలు, కులాలు, రాజకీయపార్టీలకతీతంగా అందరికీ మేలు చేశాడు. ఇక సెకండ్ వేవ్‌లో కూడా సోనూ సూద్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించాడు. సొంతంగా ఓ ఫౌండేషన్ […]
కరోనా వేళ .. సోనూ సూద్ ఎవరి ఊహకు అందనంత సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్‌లో ఎందరో వలస కూలీలను సోనూ సూద్ ఆదుకున్నాడు. అనేకమంది పేద ప్రజలకు, ఉపాధి కోల్పోయిన వారికి తనవంతు సాయం చేశాడు.
ప్రాంతాలు, కులాలు, రాజకీయపార్టీలకతీతంగా అందరికీ మేలు చేశాడు. ఇక సెకండ్ వేవ్‌లో కూడా సోనూ సూద్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించాడు. సొంతంగా ఓ ఫౌండేషన్ నెలకొల్పి దాని ద్వారా సాయం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే సోనూ సూద్ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే తొలి ఆక్సిజన్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పబోతున్నట్టు సమాచారం.
ఇప్పటికే యూఎస్, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు సోనూ సూద్ కృషి చేస్తున్నాడు. అయితే మొదటి రెండు ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరులో నెలకొల్పేందుకు సోనూ సూద్ కృషి చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం సోనూ సూద్ అతడి టీం కర్నూలులో పర్యటిస్తున్నది. అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పేందుకు ఉండే అవకాశాలపై వారు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర సంబంధిత అధికారుల నుంచి కూడా వారు అనుమతులు తీసుకున్నారు.
ఈ విషయంపై కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. ’ సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకు రావడం ఎంతో సంతోషకరం. ఈ ఆక్సిజన్ ప్లాంట్‌తో రోజుకు 200 నుంచి 300 మంది కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.