Telugu Global
Cinema & Entertainment

శ్రీదేవి కూతురితో చర్చలు షురూ

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ను టాలీవుడ్ కు తీసుకురావడానికి చాలామంది ప్రయత్నించారు. గతంలో నాగార్జున లాంటి హీరోలైతే విశ్వప్రయత్నం చేశారని చెప్పొచ్చు. కానీ జాన్వి మాత్రం శ్రీదేవిలా ఆలోచించలేదు. కేవలం బాలీవుడ్ కే ఫిక్స్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే మహేష్ ను డైరక్ట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో జాన్వి కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ […]

శ్రీదేవి కూతురితో చర్చలు షురూ
X

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ను టాలీవుడ్ కు తీసుకురావడానికి చాలామంది ప్రయత్నించారు.
గతంలో నాగార్జున లాంటి హీరోలైతే విశ్వప్రయత్నం చేశారని చెప్పొచ్చు. కానీ జాన్వి మాత్రం శ్రీదేవిలా
ఆలోచించలేదు. కేవలం బాలీవుడ్ కే ఫిక్స్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు మరోసారి ఈ
ముద్దుగుమ్మను టాలీవుడ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

త్వరలోనే మహేష్ ను డైరక్ట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో జాన్వి
కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ మేరకు తన పరిచయాల ద్వారా జాన్వి కపూర్
ను సంప్రదించాడు. ఆమెతో చర్చలు కూడా ప్రారంభించాడు.

ఈసారి మాత్రం జాన్వి, తెలుగు ఆఫర్ అంగీకరించే అవకాశం ఉంది. దీనికి కారణం అది మహేష్ బాబు
సినిమా అని మాత్రం కాదు. బాలీవుడ్ లో జాన్వికి అవకాశాలు తగ్గాయి. స్టార్ హీరోయిన్లతో ఆమె
పోటీపడలేకపోతోంది. సో.. ఆమె మహేష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  22 May 2021 1:30 PM IST
Next Story