Telugu Global
Health & Life Style

యాప్ తో ఆక్సిజన్ లెవల్స్ తెలుసుకోండిలా..

కరోనా సెకండ్‌ వేవ్‌ లో వైరస్ బారిన పడుతున్న చాలామంది ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్నారు. మరణిస్తున్న వారిలో కూడా ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్‌ లెవల్స్ ను తెలిపే పరికరాలు మన దగ్గర ఉంటే బాగుంటుంది. అయితే దీనికోసం పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లు కొనే పని లేకుండా కేవలం స్మార్ట్ ఫోన్ లో యాప్ తో కూడా తెలుసుకోవచ్చు అదెలాగంటే.. కోల్‌కతాకు చెందిన ‘కేర్‌ నౌ […]

యాప్ తో ఆక్సిజన్ లెవల్స్ తెలుసుకోండిలా..
X

కరోనా సెకండ్‌ వేవ్‌ లో వైరస్ బారిన పడుతున్న చాలామంది ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్నారు. మరణిస్తున్న వారిలో కూడా ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్‌ లెవల్స్ ను తెలిపే పరికరాలు మన దగ్గర ఉంటే బాగుంటుంది. అయితే దీనికోసం పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లు కొనే పని లేకుండా కేవలం స్మార్ట్ ఫోన్ లో యాప్ తో కూడా తెలుసుకోవచ్చు అదెలాగంటే..

కోల్‌కతాకు చెందిన ‘కేర్‌ నౌ హెల్త్‌కేర్‌’ అనే ఓ స్టార్టప్ ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్’ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఫోటో ప్లెతిస్మోగ్రఫీ టెక్నాలజీతో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పని చేస్తుంది. మామూలుగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్‌ కేవలం ఫోన్‌లోని ఫ్లాష్‌ ఆధారంగానే పనిచేస్తుంది. యాప్‌ను ఓపెన్ చేసి, ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేసి వెనుక కెమెరాపై మన వేలిని ఉంచితే చాలు. స్కాన్‌ అనే బటన్‌ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్‌, పల్స్‌, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుందని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ వ్యవస్థాపకులు చెప్తున్నారు. దీనిపై క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించామని, 96 శాతం పాజిటివిటీ రేటు ఉందని చెప్తున్నారు. ఈ యాప్ యాపిల్ స్టోర్, ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది.

First Published:  22 May 2021 8:36 AM IST
Next Story