కోవాక్సిన్ డోస్ ల మధ్య గ్యాప్ ఎందుకు పెంచలేదంటే..?
భారత్ లో ఇచ్చే కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు టీకాలు.. రెండు దఫాలుగా తీసుకోవాల్సిందే. తొలిడోసు, ఆ తర్వాత కొన్నిరోజులాగి రెండోడోసు వేసుకుంటేనే పూర్తి స్థాయిలో దాని ప్రభావం ఉంటుంది. అయితే తొలిడోసు తర్వాత రెండో డోసు తీసుకోడానికి ఎన్నిరోజులు ఆగాలి అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో 4 వారాల సమయం చాలు అంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది. తొలి డోస్ తీసుకున్నవారు 28రోజుల తర్వాతే రెండో డోసు వేసుకోడానికి అర్హులని తేల్చారు. అలాగే […]
భారత్ లో ఇచ్చే కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు టీకాలు.. రెండు దఫాలుగా తీసుకోవాల్సిందే. తొలిడోసు, ఆ తర్వాత కొన్నిరోజులాగి రెండోడోసు వేసుకుంటేనే పూర్తి స్థాయిలో దాని ప్రభావం ఉంటుంది. అయితే తొలిడోసు తర్వాత రెండో డోసు తీసుకోడానికి ఎన్నిరోజులు ఆగాలి అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో 4 వారాల సమయం చాలు అంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది. తొలి డోస్ తీసుకున్నవారు 28రోజుల తర్వాతే రెండో డోసు వేసుకోడానికి అర్హులని తేల్చారు. అలాగే టీకాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం టీకా కొరతతో రెండు నెలలు దాటినా రెండో డోసుకోసం వేచి చూసేవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.
కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారు 12 నుంచి 18వారాల లోపు రెండో డోసు తీసుకోవచ్చని తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే మొదటి డోసు తీసుకున్న తర్వాత దాదాపుగా 3నెలల నుంచి నాలుగున్నర నెలల వరకు రెండోడోసు తీసుకోవాల్సిన అవసరం లేదు. కోవిషీల్డ్ టీకా తొలిడోసు తీసుకున్న తర్వాత దాదాపు నాలుగున్నర నెలల వరకు అది సమర్థంగా పనిచేస్తుందని, ఆ తర్వాత రెండో డోసు తీసుకుంటే దాని ప్రభావం బాగుంటుందని వివరిస్తున్నారు. కోవిషీల్డ్ సరే.. మరి కోవాక్సిన్ సంగతేంటి అనేదే ఇప్పుడు ప్రశ్న.
కోవాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ పెంచలేదు..
కోవిషీల్డ్ సమర్థంగా పనిచేస్తుంది అందుకే రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచామని చెబుతున్న ఐసీఎంఆర్ హెడ్ డాక్టర్ బలరామ్ భార్గవ, కోవాక్సిన్ సమర్థత తక్కువగా ఉందని స్పష్టం చేశారు. కోవిషీల్డ్ తో పోల్చి చూస్తే, కోవాక్సిన్ టీకా సమర్థత ఆ స్థాయిలో లేదని, అందుకే నాలుగు వారాల గ్యాప్ సవరించలేదని తెలిపారు. కోవాక్సిన్ టీకా ఫస్ట్ డోస్ తీసుకున్న నెలరోజుల తర్వాత కచ్చితంగా రెండో డోసు తీసుకోవాల్సిందేనని చెప్పారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారికి 3 నెలల తర్వాతే..
ఇక కోవిడ్ నుంచి కోలుకున్నవారికి కూడా 3 నెలల తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. అప్పటి వరకు వారి శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయనే ఉద్దేశంతో, మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవడం మంచిదని చెబుతున్నారు అధికారులు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీస్ మానవ శరీరంలో ఎన్నిరోజులు ఉంటాయనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు.