Telugu Global
Health & Life Style

డబుల్ మాస్కింగ్ ఉంటేనే సేఫ్..

దేశవ్యాప్తంగా కోవిడ్ -సెకండ్ వేవ్ ను తగ్గించడానికి డబుల్ మాస్కింగ్ బెస్ట్ ఆప్షన్ అని ప్రభుత్వం సూచిస్తోంది. ఇంకా దీంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు పని చేస్తాయంటే.. డబుల్ మాస్కింగ్, శానిటేషన్, వెంటిలేటింగ్ తో రాబోయే 20 రోజులలో మహమ్మారిని 80% వరకు అరికట్టగలదని ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు. సరిగ్గా వెంటిలేషన్ లేని ఇళ్లు, ఆఫీసులే వైరస్ ఇంతగా వ్యాపించేలా చేస్తున్నాయని, బాగా వెంటిలేషన్ ఉండడం వల్ల వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించే ప్రమాదాన్ని సగం […]

డబుల్ మాస్కింగ్ ఉంటేనే సేఫ్..
X

దేశవ్యాప్తంగా కోవిడ్ -సెకండ్ వేవ్ ను తగ్గించడానికి డబుల్ మాస్కింగ్ బెస్ట్ ఆప్షన్ అని ప్రభుత్వం సూచిస్తోంది. ఇంకా దీంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు పని చేస్తాయంటే..

డబుల్ మాస్కింగ్, శానిటేషన్, వెంటిలేటింగ్ తో రాబోయే 20 రోజులలో మహమ్మారిని 80% వరకు అరికట్టగలదని ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు. సరిగ్గా వెంటిలేషన్ లేని ఇళ్లు, ఆఫీసులే వైరస్ ఇంతగా వ్యాపించేలా చేస్తున్నాయని, బాగా వెంటిలేషన్ ఉండడం వల్ల వైరస్ ఒకరి నుండి మరొకరికి సంక్రమించే ప్రమాదాన్ని సగం వరకూ అరికట్టొచ్చని నిపుణుల నివేదికలో వెల్లడైంది.కేవలం కిటికీలు, తలుపులు తెరవడం ద్వారా అలాగే ఎగ్జాస్ట్ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాపించకుండా కొంతవరకూ అడ్డుకోవచ్చు.

ఇకపోతే ఇప్పుడు స్ప్రెడింగ్ స్పీడ్ చూస్తుంటే ఒక మాస్క్ వైరస్ ఆపలేదని, డబుల్ మాస్క్ ధరించడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ లేయర్లు ఉన్న మాస్క్ ధరించడం ద్వారా వైరస్ కణాలు వ్యాపించడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే డబుల్ మాస్క్ ధరించేటప్పుడు సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ కలిపి ధరించాలి. అలాగే ఒకే మాస్క్ ను వరుసగా రెండు రోజులు వాడకూడదు. సాధారణ క్లాత్‌మాస్క్‌ సుమారు 40 శాతం వరకు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తే, సర్జికల్‌ మాస్క్ 55 శాతం వరకూ రక్షణ ఇవ్వగలదు. అదే డబుల్ మాస్క్ ద్వారా 85 శాతం రక్షణ పొందొచ్చు.

ఇలా చేయాలి
– క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్ కలిపి వాడాలి లేదా డబుల్ లేదా ట్రిపుల్ లేయర్డ్ మాస్క్ వాడాలి.
– ముక్కు పైభాగంలో మాస్క్ నొక్కినట్టు బిగుతుగా ఉండాలి. గాలి గ్యాప్ లో నుంచి లోనికి వెళ్లకూడదు.
– శ్వాస సులభంగా ఆడే మాస్క్ లు వాడాలి.
– వాషబుల్ మాస్క్ అయితే క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
– ఒకే రకమైన రెండు మాస్క్ లను కలిపి పెట్టుకోకూడదు.

First Published:  21 May 2021 9:18 AM IST
Next Story