Telugu Global
Health & Life Style

ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్.. ఎలా చేసుకోవాలంటే..

ఇప్పుడు కోవిడ్ టెస్ట్ లు చేయడం కూడా కుదరని పరిస్థితుల్లో.. ఇంటిదగ్గరే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా ‘హోం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌(హోం ర్యాట్‌ కిట్‌)’ వచ్చేసింది. దీనికి ఐసీఎంఆర్‌ ఆమోదం కూడా తెలిపింది. ఈ కిట్‌తో కరోనా టెస్ట్‌ను ఎలా చేసుకోవచ్చంటే.. కోవిసెల్ఫ్ అనే ఈ ‘హోం ర్యాట్‌ కిట్‌’ ను మహారాష్ట్రలోని పుణెకు చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ కంపెనీ తయారు చేసింది. త్వరలో ఈ కిట్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇలా ఉపయోగించాలి.. ఈ […]

ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్.. ఎలా చేసుకోవాలంటే..
X

ఇప్పుడు కోవిడ్ టెస్ట్ లు చేయడం కూడా కుదరని పరిస్థితుల్లో.. ఇంటిదగ్గరే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా ‘హోం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌(హోం ర్యాట్‌ కిట్‌)’ వచ్చేసింది. దీనికి ఐసీఎంఆర్‌ ఆమోదం కూడా తెలిపింది. ఈ కిట్‌తో కరోనా టెస్ట్‌ను ఎలా చేసుకోవచ్చంటే..

కోవిసెల్ఫ్ అనే ఈ ‘హోం ర్యాట్‌ కిట్‌’ ను మహారాష్ట్రలోని పుణెకు చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ కంపెనీ తయారు చేసింది. త్వరలో ఈ కిట్లు మార్కెట్లోకి రానున్నాయి.

ఇలా ఉపయోగించాలి..
ఈ హోం ర్యాట్‌ కిట్‌ నమూనాలను సేకరించే స్వాబ్‌ స్టిక్‌, ద్రావణం నింపిన ఒక ట్యూబ్‌, ఒక టెస్ట్‌ కార్డ్‌, పౌచ్‌ ఉంటాయి.
స్వాబ్‌ స్టిక్‌ను నాసికా రంధ్రాల్లో లేదా నోటిలోపల పెట మూడు సెంటీమీటర్ల లోపలికి పంపి తిప్పాలి. తర్వాత ఆ నమూనాల్ని ద్రావణం ఉన్న ట్యూబ్‌లో ముంచి.. మార్క్‌ గుర్తు ఉన్న వరకు స్టిక్‌ను విరిచేసి, ట్యూబ్‌ మూత పెట్టాలి.
ఆ తర్వాత ట్యూబ్‌ నుంచి రెండు చుక్కలను కిట్ లో ఉండే టెస్ట్‌ కార్డుపై వేయాలి. తర్వాత 15 నిమిషాలు వెయిట్ చేయాలి. కార్డుపై సీ (కంట్రోల్‌), టీ (టెస్ట్‌) పేరుతో రెండు సెక్షన్లు ఉంటాయి. ద్రావణాన్ని కార్డుపై వేశాక.. ‘సీ’ దగ్గర మార్క్ కనిపిస్తే కరోనా నెగెటివ్‌గా భావించాలి. ‘సీ’, ‘టీ’ రెండు సెక్షన్‌ ల దగ్గర మార్క్స్ కనిపిస్తే పాజిటివ్‌గా గుర్తించాలి.
మైల్యాబ్‌ హోంటెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా టెస్ట్ చేసే విధానం అలాగే టెస్ట్ రిజల్ట్స్ కూడా యాప్ నుంచి పొందొచ్చు. యాప్ ను , కిట్ లోని కార్డును క్యూఆర్ కోడ్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు.

First Published:  21 May 2021 9:55 AM IST
Next Story