Telugu Global
NEWS

ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు..

పోలింగ్ కు 4 వారల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధనకు విరుద్ధంగా జరిగాయనే కారణంతో ఏపీలో ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలు రద్దయినట్టు తీర్పునిచ్చింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో గతేడాది ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ముందుగా పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది, […]

ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు..
X

పోలింగ్ కు 4 వారల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధనకు విరుద్ధంగా జరిగాయనే కారణంతో ఏపీలో ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలు రద్దయినట్టు తీర్పునిచ్చింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో గతేడాది ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ముందుగా పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది, ఏగ్రీవాలు కూడా ఖరారయ్యాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో కరోనా ప్రభావంతో మొత్తం స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఎన్నికలను చేపట్టినా.. పరిషత్ ఎన్నికలను పక్కనపెట్టి కేవలం మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలను ముగించారు. పరిషత్ ఎన్నికలను తన హయాంలో చేపట్టలేనని చెప్పి నిమ్మగడ్డ పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ గా వచ్చిన నీలం సాహ్ని వెంటనే పరిషత్ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ ఇచ్చి అదే నెల 8న పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారు.

అయితే ఎన్నికలపై నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కోర్టుకెక్కాయి. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ లో సవాల్ చేసింది. పోలింగ్‌ కు అనుమతించిన డివిజన్‌ బెంచ్‌.. తదుపరి ఆదేశాలు ఇచ్చాకే ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశించింది. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈ కేసుపై విచారణ కొనసాగింది. తాజాగా ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే గతంలోని ఏకగ్రీవాలు మాత్రం అలానే ఉంటాయని, ఎన్నికలు జరిగిన 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే తిరిగి కొత్త నోటిఫికేషన్ తో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.

First Published:  21 May 2021 8:51 AM IST
Next Story