పొన్నాంబళంకు చిరు సాయం
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికిమొన్న పావల శ్యామలను ఆదుకున్న చిరంజీవి, ఇప్పుడు తమిళనటుడు పొన్నాంబళంను ఆదుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు చిరు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. మెగాస్టార్ […]
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు.
మొన్నటికిమొన్న పావల శ్యామలను ఆదుకున్న చిరంజీవి, ఇప్పుడు తమిళనటుడు పొన్నాంబళంను
ఆదుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో
బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు చిరు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు
లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేశారు.
పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. మెగాస్టార్
చిరంజీవి తనకు రెండు లక్షల రూపాయలు సహాయం చేశారని తెలుసుకున్న పొన్నాంబళం చిరంజీవికి
కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు తదితర చిత్రాల్లో
పొన్నాంబళం నటించారు. ఆయా సినిమాల్లో వీరిద్దరి మధ్యా జరిగే ఫైట్స్ ను అప్పట్లో జనం తెగ ఎంజాయ్
చేశారు.