Telugu Global
NEWS

ఏపీలో విజృంభిస్తున్న బ్లాక్​ఫంగస్​.. చికిత్స ఇస్తున్న ఆస్పత్రులు ఇవే..!

దేశంలో రోజురోజుకూ బ్లాక్​ఫంగస్​ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనాకు చికిత్స తీసుకొని.. రెమిడెసివిర్​, స్టెరాయిడ్స్​ వాడిన వాళ్లకు బ్లాక్​ ఫంగస్​ ముప్పు ఎక్కువగా ఉంటుందిన వైద్యులు చెబుతున్నారు. బ్లాక్​ ఫంగస్​ గురించి ఆందోళన చెందవద్దని.. కరోనా నుంచి కోలుకున్న వారందరికీ ఈ వ్యాధి సోకదని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, కిడ్నీసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవాళ్లకు కరోనా సోకడం.. వారికి చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్​ […]

ఏపీలో విజృంభిస్తున్న బ్లాక్​ఫంగస్​.. చికిత్స ఇస్తున్న ఆస్పత్రులు ఇవే..!
X

దేశంలో రోజురోజుకూ బ్లాక్​ఫంగస్​ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనాకు చికిత్స తీసుకొని.. రెమిడెసివిర్​, స్టెరాయిడ్స్​ వాడిన వాళ్లకు బ్లాక్​ ఫంగస్​ ముప్పు ఎక్కువగా ఉంటుందిన వైద్యులు చెబుతున్నారు.

బ్లాక్​ ఫంగస్​ గురించి ఆందోళన చెందవద్దని.. కరోనా నుంచి కోలుకున్న వారందరికీ ఈ వ్యాధి సోకదని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, కిడ్నీసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవాళ్లకు కరోనా సోకడం.. వారికి చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్​ ఇస్తే బ్లాక్​ఫంగస్​ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

అయితే మొదట ఉత్తరాదికే పరిమితమైన ఈ వ్యాధి.. తాజాగా తెలుగురాష్ట్రాలకు కూడా పాకింది. ప్రారంభంలో ఈ వ్యాధిని గుర్తిస్తే నయం చేయవచ్చని డాక్టర్లు అంటున్నారు. బ్లాక్​ఫంగస్​ను ‘ప్రమాదకరమైన జబ్బు’గా గుర్తించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో పలు కీలక సూచనలు చేసింది.

బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స, నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదేశించారు.
దీంతో ఏపీ ప్రభుత్వం కూడా బ్లాక్​ఫంగస్​ను ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించారు. అంతేకాక దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చారు.రాష్ట్రంలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో బ్లాక్​ఫంగస్​కు వైద్యం చేస్తున్నారు.

బ్లాక్​ఫంగస్​కు వైద్యం అందిస్తున్న ఆస్పత్రులు ఇవే..!

అనంతపూరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్),
ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి స్విమ్స్,
తిరుపతి జీజీహెచ్,
కాకినాడ జీజీహెచ్,
జీజీహెచ్ (రిమ్స్),
కడప జీజీహెచ్,
విజయవాడ గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి,
కర్నూల్ జీజీహెచ్, కర్నూలు జీజీహెచ్ (రిమ్స్),
ఒంగోలు జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల),
నెల్లూరు జీజీహెచ్, శ్రీకాకుళం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి,
విశాఖపట్నం గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్,
విశాఖపట్నం ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి) కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం విమ్స్, విశాఖపట్నం

First Published:  21 May 2021 5:37 AM IST
Next Story