Telugu Global
Health & Life Style

ఇంట్లోనే కోవిడ్ పరీక్ష ఇలా..

కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే కొన్ని సందర్భాల్లో తెగబారెడు క్యూలైన్లలో నిలబడాల్సిందే. పాజిటివ్ రిపోర్ట్ లేనిదే ఆస్పత్రుల్లో వైద్యం అందని పరిస్థితులూ ఉన్నాయి. అనుమానంతో టెస్ట్ కి వెళితే.. క్యూలైన్లో కరోనా అంటుకుంటుందేమోనన్న భయం మరికొందరిది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఎవరికి వారే కోవిడ్ టెస్ట్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే మైల్యాబ్ సంస్థ ‘కొవిసెల్ఫ్’ అనే టెస్ట్ కిట్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ టెస్ట్ కిట్ లోని పరికరాన్ని ఉపయోగించి మనకి మనమే ముక్కులోని స్వాబ్ […]

ఇంట్లోనే కోవిడ్ పరీక్ష ఇలా..
X

కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే కొన్ని సందర్భాల్లో తెగబారెడు క్యూలైన్లలో నిలబడాల్సిందే. పాజిటివ్ రిపోర్ట్ లేనిదే ఆస్పత్రుల్లో వైద్యం అందని పరిస్థితులూ ఉన్నాయి. అనుమానంతో టెస్ట్ కి వెళితే.. క్యూలైన్లో కరోనా అంటుకుంటుందేమోనన్న భయం మరికొందరిది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఎవరికి వారే కోవిడ్ టెస్ట్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే మైల్యాబ్ సంస్థ ‘కొవిసెల్ఫ్’ అనే టెస్ట్ కిట్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ టెస్ట్ కిట్ లోని పరికరాన్ని ఉపయోగించి మనకి మనమే ముక్కులోని స్వాబ్ తీసుకుని కోవిడ్ పరీక్ష చేసుకోవచ్చు. స్వాబ్ తీసే పరికరాలన్నీ కిట్ లోనే ఉంటాయి. అదే కిట్ లో ఉన్న స్ట్రిప్ పై ఆ స్వాబ్ ని ఉంచి రంగు మారిన తర్వాత ఫొటో తీసి ‘కొవిసెల్ఫ్’ యాప్ లో అప్ లోడ్ చేయాలి. రిజల్ట్ పాజిటివా, నెగెటివా అనేది యాప్ లో తెలిసిపోతుంది. ఎవరికి వారే సొంతగా ఈ టెస్ట్ చేసుకోవచ్చు.

ఈ కొవిసెల్ఫ్ కిట్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ఆమోదం తెలపడంతో ఇప్పుడిది మార్కెట్లోకి వచ్చింది. దీని ధర రూ.250 గా నిర్ణయించారు. ఆస్పత్రులకు వెళ్లే అవకాశం లేనివారు, బయటకు వెళ్లలేని వారు దీనితో ఇంట్లోనే కోవిడ్ నిర్థారణ చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ మాత్రమే. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి కొవిసెల్ఫ్ కిట్ లో నెగెటివ్ వచ్చినంత మాత్రాన కరోనా లేనట్టు కాదని, లక్షణాలు అధికంగా ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఒకవేళ కొవిసెల్ఫ్ కిట్ లో పాజిటివ్ వస్తే వెంటనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ తగిన వైద్యం తీసుకోవాలని సూచించింది.

కరోనా వ్యాప్తి అరికట్టాలంటే ముందుగా వ్యాధిని నిర్థారించుకోవాలి. అయితే గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేక అసలు వ్యాధిని తెలుసుకునేలోపే చాలామందికి సీరియస్ అవుతోంది. ఈ దశలో గ్రామస్తులకు, వైద్య సౌకర్యాలకు దూరంగా ఉన్నవారికి, ఈ కిట్ చాలా ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. మెడికల్ షాపులో కొనుక్కుని ఇంట్లోనే పరీక్ష చేసుకుని, కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు.

First Published:  20 May 2021 1:01 PM IST
Next Story