‘కేసీఆర్ గాంధీ సందర్శన’ .. విమర్శలకు అదే సమాధానం
తన మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన ప్రతిసారి తనదైన స్టయిల్లో సమాధానం చెప్పడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అది మాటల ద్వారా అయినా కావచ్చు. లేదంటే చేతల ద్వారా అయినా కావచ్చు. ఇటీవల ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్‌ను తెలంగాణ క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి అదే వేరే చర్చ. ఇదిలా ఉంటే అప్పటి నుంచి ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దే ఉంది. దీంతో […]
తన మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన ప్రతిసారి తనదైన స్టయిల్లో సమాధానం చెప్పడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అది మాటల ద్వారా అయినా కావచ్చు. లేదంటే చేతల ద్వారా అయినా కావచ్చు. ఇటీవల ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్‌ను తెలంగాణ క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి అదే వేరే చర్చ.
ఇదిలా ఉంటే అప్పటి నుంచి ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దే ఉంది. దీంతో ప్రతిపక్ష నేతలు, కొన్ని వర్గాల ప్రజల నుంచి కేసీఆర్మీద విమర్శలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంటే ఎంతో చక్కగా ఆరోగ్యశాఖను చూస్తున్న ఈటల రాజేందర్ ను పక్కన పెట్టారని.. సీఎం కేసీఆర్ ఆ శాఖను తనవద్దే పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆరోపణలు వచ్చాయి.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేసీఆర్ విమర్శలకు సమాధానం చెప్పే పనిలో పడ్డారు. వరసగా కొన్నిరోజుల పాటు ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఇవాళ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఐసీయూ లోకి వెళ్లి రోగులను పలుకరించి వాళ్లకు వైద్యం ఎలా అందుతుందో తెలుసుకున్నారు. అక్కడ వైద్యం ఎలా సాగుతుందంటూ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఎంతో గొప్ప పనిచేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్నది. మరోవైపు ఈటల లేని లోటును స్వయంగా కేసీఆరే తీరుస్తున్నారంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.