'కొత్త పాలసీ' తీసుకోవాల్సిందే.. లేదంటే సేవలు కట్..! వాట్సాప్ స్పష్టీకరణ
వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో చాలామంది వాట్సాప్‌ను అన్ ఇన్స్టాల్ చేసుకున్నారు కూడా.. వాట్సాప్ స్థానంలో సిగ్నల్, టెలీగ్రామ్ లాంటి యాప్స్‌కు డౌన్లోడ్స్ పెరిగాయి. దీంతో కొంచెం వెనక్కితగ్గినట్టు కనిపించిన వాట్సాప్ .. ఆ తర్వాత మాత్రం మళ్లీ రెచ్చిపోయింది.
వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో చాలామంది వాట్సాప్‌ను అన్ ఇన్స్టాల్ చేసుకున్నారు కూడా.. వాట్సాప్ స్థానంలో సిగ్నల్, టెలీగ్రామ్ లాంటి యాప్స్‌కు డౌన్లోడ్స్ పెరిగాయి. దీంతో కొంచెం వెనక్కితగ్గినట్టు కనిపించిన వాట్సాప్ .. ఆ తర్వాత మాత్రం మళ్లీ రెచ్చిపోయింది. ప్రతి ఒక్కరూ కొత్త నిబంధనలు అంగీకరించాల్సిందేనని.. లేదంటే వాళ్ల ఖాతాలను దశలవారీగా తొలగిస్తామంటూ స్పష్టం చేసింది.
అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వాట్సాప్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎవరైనా వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పారు. అలా చేయని పక్షంలో దశల వారీగా వాళ్ల అకౌంట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు.
వాట్సాప్ ఐటీ నిబంధనల ప్రకారమే కొత్త రూల్స్ తీసుకొచ్చిందని ఆయన కోర్టుకు విన్నవించారు.
ప్రైవసీ పాలసీని వాయిదా వేయడం కుదరదని ఆయన కుండబద్దలు కొట్టారు. తాము పూర్తిగా నిబంధనల ప్రకారమే వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్ కొత్త విధానంతో చాలా ఇబ్బందులు ఉన్నాయని .. దేశవ్యాప్తంగా ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఈ విషయంపైనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ, పిటీషనర్లు కోరారు. అయితే కోర్టు ఇందుకు నిరాకరించింది. ఇందుకు సంబంధించిన విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.