గ్లామర్ హీరోయిన్ గా చూడొద్దు
మిల్కీ బ్యూటీ తమన్న తనను ఇకపై గ్లామర్ క్వీన్ గా చూడొద్దని చెబుతోంది. మంచి పాత్రలుంటే, అవి డీ-గ్లామరైజ్డ్ రోల్స్ అయినప్పటికీ చేస్తానంటోంది. రీసెంట్ గా ఆమె ఓటీటీలోకి ఎంటరైంది. ఆహా యాప్ కు లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ చేసింది. డిస్నీ హాట్ స్టార్ లో మరో వెబ్ సిరీస్ తో అలరించబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తమన్న.. సినిమాల్లో ఆఫర్ చేసినట్టు ఓటీటీలో తనకు గ్లామర్ పాత్రలు ఆఫర్ చేయొద్దని అంటోంది. […]
మిల్కీ బ్యూటీ తమన్న తనను ఇకపై గ్లామర్ క్వీన్ గా చూడొద్దని చెబుతోంది. మంచి పాత్రలుంటే, అవి
డీ-గ్లామరైజ్డ్ రోల్స్ అయినప్పటికీ చేస్తానంటోంది. రీసెంట్ గా ఆమె ఓటీటీలోకి ఎంటరైంది. ఆహా యాప్ కు
లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ చేసింది. డిస్నీ హాట్ స్టార్ లో మరో వెబ్ సిరీస్ తో అలరించబోతోంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తమన్న.. సినిమాల్లో ఆఫర్ చేసినట్టు ఓటీటీలో తనకు గ్లామర్
పాత్రలు ఆఫర్ చేయొద్దని అంటోంది. మంచి పాత్రలతో వస్తేనే నటిస్తానని చెబుతోంది. సినిమా ఫీల్డ్ కు
సంబంధించి గ్లామర్ ముఖ్యమని, ఓటీటీలో మాత్రం నటించడానికి ఆస్కారం ఉండే పాత్రలు మాత్రమే
చేస్తానని చెబుతోంది.
ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే, తమన్న మాత్రం ఫుల్ బిజీ
అయిపోయింది. గతేడాది లాక్ డౌన్ టైమ్ కూడా బిజీగా గడిపింది. ఈసారి కూడా అంతే బిజీగా ఉంది.
సినిమాల్లేకపోయినా రెండు చేతులతో బాగానే సంపాదిస్తోంది.