Telugu Global
Cinema & Entertainment

జక్కన్న బాహుబలి సెంటిమెంట్

లెక్కప్రకారం గతేడాది రిలీజ్ అవ్వాలి ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ ఏడాది పండక్కి అనుకున్నారు. అది కూడా జరగలేదు. ఇక అక్టోబర్ రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావడం లేదు. మళ్లీ వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. సరిగ్గా ఇక్కడే రాజమౌళికి ఓ సెంటిమెంట్ గుర్తొచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి కంటే సమ్మర్ బెటరని జక్కన్న భావిస్తున్నాడు. ఎందుకంటే, సమ్మర్ లోనే బాహుబలి రిలీజైంది. కాబట్టి […]

జక్కన్న బాహుబలి సెంటిమెంట్
X

లెక్కప్రకారం గతేడాది రిలీజ్ అవ్వాలి ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ ఏడాది పండక్కి అనుకున్నారు. అది కూడా
జరగలేదు. ఇక అక్టోబర్ రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావడం
లేదు. మళ్లీ వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. సరిగ్గా ఇక్కడే రాజమౌళికి ఓ సెంటిమెంట్
గుర్తొచ్చింది.

వచ్చే ఏడాది సంక్రాంతి కంటే సమ్మర్ బెటరని జక్కన్న భావిస్తున్నాడు. ఎందుకంటే, సమ్మర్ లోనే
బాహుబలి రిలీజైంది. కాబట్టి అదే తేదీకి ఆర్ఆర్ఆర్ ను కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని సెంటిమెంట్
గా ఫీల్ అవుతున్నాడు రాజమౌళి.

ఇక్కడ మరో కోణం కూడా ఉంది. మహేష్ సర్కారువారి పాట, పవన్ హరిహర వీరమల్లు సినిమాల్ని
ఇప్పటికే సంక్రాంతికి ప్రకటించారు. ఇలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ ను ఫ్రెష్ గా సంక్రాంతి బరిలో దించితే
అనవసరమైన పోటీ పెంచినట్టవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వచ్చే ఏడాది ఏప్రిల్ కు సినిమాను
వాయిదావేస్తే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నాడు.

First Published:  18 May 2021 2:48 PM IST
Next Story