Telugu Global
CRIME

‘సోనూ సూద్’​ పేరిట వసూళ్లు.. చివరకు ఆయన్ను కూడా వదలరా?

లాక్​డౌన్​ టైంలో సోనూ సూద్​ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గొప్ప మానవతావాదిగా ఆయనకు సోషల్​ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు సోనూ సూద్​ పేరిట కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సోనూ సూద్​ దేశవ్యాప్తంగా కోవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఓ ఫౌండేషన్​ను నెలకొల్పారు. చాలామంది ఈ ట్రస్ట్​కు విరాళాలు ఇస్తున్నారు. ఇదిలా […]

‘సోనూ సూద్’​ పేరిట వసూళ్లు.. చివరకు ఆయన్ను కూడా వదలరా?
X

లాక్​డౌన్​ టైంలో సోనూ సూద్​ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గొప్ప మానవతావాదిగా ఆయనకు సోషల్​ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు సోనూ సూద్​ పేరిట కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సోనూ సూద్​ దేశవ్యాప్తంగా కోవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందజేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఓ ఫౌండేషన్​ను నెలకొల్పారు. చాలామంది ఈ ట్రస్ట్​కు విరాళాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫౌండేషన్​ పేరిట .. కొందరు సైబర్​ నేరగాళ్లు ఓ అకౌంట్​ను క్రియేట్​ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.

సోనూ సూద్ ఫౌండేషన్​ అని తెలియగానే చాలా మంది ఈ అకౌంట్ కు డబ్బులు పంపించారు. చివరకు ఇదంతా ఫేక్​ అని తేలింది. ఈ విషయం సోనూ సూద్ దృష్టికి వెళ్ళడంతో.. తన పేరిట వైరల్​ అవుతున్న పోస్టు ఫేక్​ అని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు ఫేక్ ఖాతాకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తన అఫిషియల్​ ఫేస్​బుక్​, లేదా ట్విట్టర్​ అకౌంట్​ నుంచి వచ్చిన మేసేజ్​లు మాత్రమే నమ్మాలని ఆయన సూచించారు. ‘సోనూ సూద్​ ఫౌండేషన్​కు మీరు విరాళం ఇవ్వండి.. ఒక్కరూపాయి నుంచి ఎన్ని వేలైనా ఇవ్వండి.. మీరు చేసే సాయం నేరుగా పేద ప్రజలకు చేరుతుంది’ అంటూ కొందరు ఫేక్​ రాయుళ్లు సోనూ సూద్​ పేరిట ఓ అకౌంట్​, ఫోనే పే ను క్రియేట్​ చేసి దోపిడీకి తెరలేపారు. దీంతో ఈ విషయం సోనూ సూద్​ దృష్టికి వెళ్లగా ఆయన నేరుగా స్పందించి అందరినీ అప్రమత్తం చేశారు. మంచి చేసేవాళ్లను కూడా వదలరా.. అంటూ సోషల్ మీడియాలో కేటుగాళ్లను తిట్టి పోస్తున్నారు.

First Published:  18 May 2021 8:39 AM IST
Next Story