Telugu Global
Health & Life Style

వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడిని తగ్గించే గ్యాడ్జెట్స్..

ఇప్పుడు చాలామంది ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ మరో నాలుగైదు నెలలపాటైనా పొడిగించే అవకాశం ఉంది. అయితే ఒకేచోట కూర్చొని ఎనిమిది గంటలు పని చేయడం కాస్త కష్టమే.. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు కొన్ని చిన్న చిన్న గ్యాడ్జెట్స్ తో ఒత్తిడి నుంచి కొంత రిలాక్స్ అవ్వొచ్చు. అవేంటంటే.. జెల్‌‌ ఐ మాస్క్‌‌: ఇంటి నుంచి పని చేసే వాళ్లు ఎక్కువసేపు […]

వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడిని తగ్గించే గ్యాడ్జెట్స్..
X

ఇప్పుడు చాలామంది ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ మరో నాలుగైదు నెలలపాటైనా పొడిగించే అవకాశం ఉంది. అయితే ఒకేచోట కూర్చొని ఎనిమిది గంటలు పని చేయడం కాస్త కష్టమే.. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు కొన్ని చిన్న చిన్న గ్యాడ్జెట్స్ తో ఒత్తిడి నుంచి కొంత రిలాక్స్ అవ్వొచ్చు. అవేంటంటే..

జెల్‌‌ ఐ మాస్క్‌‌: ఇంటి నుంచి పని చేసే వాళ్లు ఎక్కువసేపు ల్యాప్‌‌టాప్‌‌, కంప్యూటర్‌ స్క్రీన్స్‌ను చూడడం వల్ల కళ్లు చాలా అలసిపోతాయి. దీనివల్ల తలనొప్పి, నిద్రలేమి లాంటి సమస్యలొస్తుంటాయి. అందుకే కళ్లను కూల్ గా, రిలాక్స్డ్ గా ఉంచే జెల్ ఐ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం దొరుకుతుంది.

బబుల్‌‌ డోర్‌‌‌‌మ్యాట్‌‌: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు రోజంతా ఇంట్లోనే ఉండటం వల్ల కూడా కొంత అలసటగా అనిపిస్తుంది. అందుకే బబుల్ డోర్ మ్యాట్స్ వాడి కొంత యాక్టివ్ నెస్ ను పొందొచ్చు. బబుల్స్ తో ఉండే ఈ మ్యాట్స్ పై కాసేపు నడిస్తే.. పాదాలకు రక్తప్రసరణ జరిగి మెల్లగా రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒకే చోట కూర్చొని పని చేసే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

అరోమా ఆయిల్ డిఫ్యూజర్‌‌‌‌: మంచి సువాసనలు మెదడుని రిలాక్స్ చేయగలవు. అందుకే వర్క్‌‌ చేసే గదిలో అరోమా ఆయిల్‌‌ డిఫ్యూజర్‌‌‌‌ ఉంచుకుంటే మంచి సువాసనతో మెదడుకి రిలాక్సింగ్‌‌ మూడ్‌‌ అందిస్తుంది. ఈ ఆయిల్ సువాసనకు బ్రెయిన్‌‌ కూడా యాక్టివ్‌‌గా ఉంటుంది.

గ్లాసెస్: ఎక్కువ రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు వాళ్ల కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రోజుకి ఎనిమిది గంటల చొప్పున స్క్రీన్ ను చూస్తూ ఉండడం వల్ల కళ్లపై భారం ఎక్కువగా పడుతుంది. అందుకే ఇలాంటి వాళ్లు కంప్యూటర్ స్క్రీన్ నుంచి బ్లూ లైట్ ను తగ్గించే గ్లాసెస్‌ వాడాలి. వీటిని యాంటీ రిఫ్లెక్టరీ కోటింగ్ గ్లాసెస్ అంటారు. ఇవి స్క్రీన్స్‌‌పై నుంచి వచ్చే బ్లూ లైట్‌ ఎఫెక్ట్‌‌ను తగ్గిస్తాయి.

First Published:  17 May 2021 9:16 AM IST
Next Story