Telugu Global
Cinema & Entertainment

ఆర్డర్ మార్చిన రెబల్ స్టార్

ప్రభాస్ చేతిలో ఇప్పుడు 4 సినిమాలున్నాయి. అందులో ఒకటి ఇంకా పక్కా అవ్వలేదు. ఆ సంగతి పక్కనపెడితే.. వీటి ఆర్డర్ పై ఇన్నాళ్లూ ఆడియన్స్ ఓ క్లారిటీతో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తన సినిమాల ఆర్డర్ మార్చాడు. ఆ సినిమానే ఆదిపురుష్. ఆదిపురుష్ సినిమా లేట్ అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్ ఎక్కువ పడుతుంది. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ఇచ్చినప్పటికీ, ఆ తేదీకి సినిమా […]

ఆర్డర్ మార్చిన రెబల్ స్టార్
X

ప్రభాస్ చేతిలో ఇప్పుడు 4 సినిమాలున్నాయి. అందులో ఒకటి ఇంకా పక్కా అవ్వలేదు. ఆ సంగతి
పక్కనపెడితే.. వీటి ఆర్డర్ పై ఇన్నాళ్లూ ఆడియన్స్ ఓ క్లారిటీతో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ తన
సినిమాల ఆర్డర్ మార్చాడు. ఆ సినిమానే ఆదిపురుష్.

ఆదిపురుష్ సినిమా లేట్ అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఈ సినిమాకు గ్రాఫిక్
వర్క్ ఎక్కువ పడుతుంది. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ఇచ్చినప్పటికీ, ఆ తేదీకి
సినిమా రాదనే విషయం ఇప్పుడే అందరికీ అర్థమైపోయింది.

అయితే అలా లేట్ అవ్వకుండా ప్రభాస్ ఇప్పుడు ఆర్డర్ మార్చాడు. ఆది పురుష్ నే ముందుకు తెచ్చాడు.
ఈ మేరకు సలార్ సినిమాను వెనక్కి జరిపాడు. షూటింగ్స్ మొదలైన వెంటనే ఆదిపురుష్ మూవీనే
పూర్తిచేయబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాతే సలార్ సినిమా స్టార్ట్ అవుతుంది.

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇంకా 3 నెలల షూటింగ్ మిగిలి ఉంది. వీలైతే ఏకథాటిగా నెల రోజుల
పాటు ఈ సినిమాకు వర్క్ చేసిన తర్వాతే మరో సినిమాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు యంగ్ రెబల్
స్టార్.

First Published:  17 May 2021 1:28 PM IST
Next Story