చెర్రీ సినిమాపై మెగా టెన్షన్
ఇప్పటికే సినిమాల విషయంలో చాలా లేట్ చేస్తున్నాడు రామ్ చరణ్. అప్పుడెప్పుడో వచ్చిన వినయ విధేయ రామ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా రిలీజ్ చేయలేకపోయాడు. సినిమాల ఎంపికలో చరణ్ ఆలస్యం ఒక కారణమైతే, కరోనా మరో కారణం. ఇప్పుడు కెరీర్ పరంగా మరోసారి అదే పరిస్థితి చరణ్ కు ఎదురుకాబోతోంది. ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు చరణ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఊహించని విధంగా […]
ఇప్పటికే సినిమాల విషయంలో చాలా లేట్ చేస్తున్నాడు రామ్ చరణ్. అప్పుడెప్పుడో వచ్చిన వినయ
విధేయ రామ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా రిలీజ్ చేయలేకపోయాడు. సినిమాల ఎంపికలో చరణ్
ఆలస్యం ఒక కారణమైతే, కరోనా మరో కారణం. ఇప్పుడు కెరీర్ పరంగా మరోసారి అదే పరిస్థితి చరణ్ కు
ఎదురుకాబోతోంది.
ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు చరణ్. దీనికి
సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఊహించని విధంగా శంకర్ ఇప్పుడు కోర్టు
కేసులు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఆ ప్రభావం రామ్ చరణ్ పై చేయబోయే సినిమాపై పడింది.
రాబోయే రోజుల్లో దీనిపై రామ్ చరణ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే కెరీర్ లో మరోసారి లాంగ్ గ్యాప్
తప్పదు. సో.. అర్జెంట్ గా చరణ్ ఇప్పుడు మరో ప్రాజెక్టును ఓకే చేయాల్సి ఉంది. శంకర్ సినిమా
అనుకున్న టైమ్ కు సెట్స్ పైకి వస్తే ఓకే. లేదంటే వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేసేలా చెర్రీ సిద్ధంగా
ఉండాలి.
ప్రస్తుతానికైతే చరణ్ అలాంటి ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. అదే ఇప్పుడు మెగాభిమానుల్ని
అమితంగా టెన్షన్ కు గురిచేస్తోంది.