ఏపీలో కర్ప్యూ పొడిగింపు..
ఏపీలో కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కర్ప్యూని పొడిగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. తాజా ఆదేశాలతో నెలాఖరు వరకు ఏపీలో కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 14రోజుల కర్ఫ్యూ గడువు ముగియడానికి రెండు రోజుల ముందే పొడిగింపు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కర్ఫ్యూ వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 5నుంచి ఏపీలో 18గంటల కర్ఫ్యూ […]
ఏపీలో కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కర్ప్యూని పొడిగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. తాజా ఆదేశాలతో నెలాఖరు వరకు ఏపీలో కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 14రోజుల కర్ఫ్యూ గడువు ముగియడానికి రెండు రోజుల ముందే పొడిగింపు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కర్ఫ్యూ వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈనెల 5నుంచి ఏపీలో 18గంటల కర్ఫ్యూ అమలులో ఉంది. ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసరాలకోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతిస్తున్నారు. ఈనెల 19వరకు అంటే 14రోజులపాటు కర్ఫ్యూ అమలులో ఉండేలా గతంలో ఉత్తర్వులిచ్చారు. ఇప్పుడీ గడువుని నెలాఖరు వరకు పొడిగించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులే అయిందన్న సీఎం జగన్, కర్ఫ్యూ కనీసం 4 వారాలు ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు జగన్ స్పష్టం చేశారు. వారికి ఆర్థికసాయం అందజేయడంపై కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా ఆరోగ్యశ్రీలోకే..
కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చింది. కరోనా తగ్గిన తర్వాత చాలామందిని బ్లాక్ ఫంగస్ ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీలో కూడా ఇదే తరహా కేసులు బయటపడుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఔషధాలకు కొరత వచ్చిందని, వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయనే వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.