కేదారనాథుడైనా, జగన్నాథుడైనా.. భక్తుల సందడి లేదు..
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో పెద్ద పెద్ద ఆలయాలన్నీ మూతబడ్డాయి. భక్తులకు దర్శనాలు లేకుండా పూజారులే ఏకాంతంగా పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయం 6 నెలల తర్వాత ఈ ఉదయం తెరచుకుంది. సాధారణంగా.. ఆరు నెలల తర్వాత తొలి దర్శనంకోసం భక్తులు పోటెత్తేవారు. అయితే ఈ ఏడాది మాత్రం సాధారణ దర్శనాలను ప్రభుత్వం నిలిపివేసింది. చార్ ధామ్ యాత్రకు ఈ ఏడాది భక్తులెవర్నీ అనుమతించడంలేదు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో పెద్ద పెద్ద ఆలయాలన్నీ మూతబడ్డాయి. భక్తులకు దర్శనాలు లేకుండా పూజారులే ఏకాంతంగా పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయం 6 నెలల తర్వాత ఈ ఉదయం తెరచుకుంది. సాధారణంగా.. ఆరు నెలల తర్వాత తొలి దర్శనంకోసం భక్తులు పోటెత్తేవారు. అయితే ఈ ఏడాది మాత్రం సాధారణ దర్శనాలను ప్రభుత్వం నిలిపివేసింది. చార్ ధామ్ యాత్రకు ఈ ఏడాది భక్తులెవర్నీ అనుమతించడంలేదు.
గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరచుకోగా.. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 18 మంగళవారం ఉదయం తెల్లవారు ఝామున 4.15 గంటలకు బ్రహ్మముహూర్తంలో తిరిగి తెరుస్తారు. గతేడాది నవంబర్ 16న ఈ ఆలయాన్ని మూసివేశారు. చార్ ధామ్ యాత్రలోని కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చలికాలంలో మూసివేసి.. తిరిగి ఆరు నెలల తర్వాత ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు. చార్ ధామ్ యాత్రకు ప్రతి ఏడాదీ ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. కోవిడ్ కారణంగా.. ఈ ఏడాది యాత్రను రద్ద చేయడంతో భక్తుల సందడి లేకుండా పోయింది.
అటు ఒడిశాలోని జగన్నాథుడి ఆలయాన్ని కూడా వచ్చే నెల 15 వరకు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 5న ఒడిశా ప్రబుత్వం లాక్ డౌన్ విధించడంతో.. ఆలయాన్ని మూసివేశారు. శనివారం కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం చందన్ యాత్ర ప్రారంభమైంది. పూరీలో ఈ ఏడాది రథయాత్ర జూలై 12 నుంచి మొదలు కావాల్సి ఉంది. రథాల నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యే వరకు వడ్రంగి, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచుతామని అధికారులు తెలిపారు. కరోనా మొదటి వేవ్ లో పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి, పెద్ద ఎత్తున అర్చకులు, సేవకులు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది మరింత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రథ యాత్ర సమయానికి పరిస్థితులు చక్కబడితే, తిరిగి భక్తుల సందడితో పూజా కార్యక్రమాలన్నీ యధావిదిగా జరుగుతాయి.