Telugu Global
National

ఆరు రాష్ట్రాలను వణికిస్తున్న తౌక్టే..

తౌక్టే తుపాను ధాటికి గోవా చిగురుటాకులా వణికిపోతోంది, కేరళ తీరప్రాంతం అతలాకుతలం అవుతోంది. కర్నాటక భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ముంబై తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు, బాంద్రా-సిర్లీ సముద్ర మార్గం మూతపడింది, రేపటినుంచి, ఎల్లుండి తుపాను తీరం దాటే వరకు గుజరాత్ కి ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వినపడుతున్నాయి. ఇటు ఏపీ, తమిళనాడుపై కూడా తౌక్టే ప్రభావం కనిపిస్తోంది. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తమ్మీద కరోనా […]

ఆరు రాష్ట్రాలను వణికిస్తున్న తౌక్టే..
X

తౌక్టే తుపాను ధాటికి గోవా చిగురుటాకులా వణికిపోతోంది, కేరళ తీరప్రాంతం అతలాకుతలం అవుతోంది. కర్నాటక భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ముంబై తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు, బాంద్రా-సిర్లీ సముద్ర మార్గం మూతపడింది, రేపటినుంచి, ఎల్లుండి తుపాను తీరం దాటే వరకు గుజరాత్ కి ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వినపడుతున్నాయి. ఇటు ఏపీ, తమిళనాడుపై కూడా తౌక్టే ప్రభావం కనిపిస్తోంది. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తమ్మీద కరోనా కష్టకాలంలో వచ్చిన తౌక్టే తుపాను ఆరు రాష్ట్రాలకు ముప్పుగా మారింది.

గోవాకు ఉత్తర వాయవ్యంలో తుపాను కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 18 మధ్యాహ్నం 12.30నుంచి రాత్రి 8.30 గంటల మధ్య గుజరాత్ లోని పోర్ బందర్ – నలియా మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. తౌక్టే ప్రభావంతో గోవా, కేరళల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంతం కోతకు గురైంది. ఆరు రాష్ట్రాలలో భారీ వర్షాలకు నలుగురు మృతి చెందారు. చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కర్నాటకలోని 73 గ్రామాలు తౌక్టే ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. ఆరు రాష్ట్రాల్లో మొత్తం 53 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలకోసం మోహరించాయి.

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సమీక్ష..
తౌక్టే ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేర్వేరుగా ఆయా రాష్ట్రాల అధినేతలతో సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు.

ముంబైలో హై అలర్డ్..
భారత వాతావరణ విభాగం హెచ్చరికలతో.. 500 మంది కోవిడ్‌ పేషెంట్లను ముంబైలోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు అధికారులు. ముందు జాగ్రత్తగా బాంద్రా-సిర్లి సముద్ర మార్గాన్ని మూసి వేశారు. తౌక్టే తుపాను కార‌ణంగా గుజరాత్ వెళ్లాల్సిన ప‌లు రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ర‌ద్దుచేసింది. పూరి-ఓఖా ఎక్స్‌ ప్రెస్‌, రాజ్‌ కోట్‌-సికింద్రాబాద్‌, పోర్ బందర్-సికింద్రాబాద్, ఓఖా రామేశ్వరం ఎక్స్ ప్రెస్ లతోపాటు పలు ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేశారు.

First Published:  16 May 2021 8:07 AM GMT
Next Story