Telugu Global
National

మిస్​ కాల్​ ఇస్తే ఇంటికే ఆక్సిజన్​.. సోనూ సూద్ ఔదర్యం

కరోనా ఫస్ట్​వేవ్​, లాక్​డౌన్ టైంలో హీరోగా మారిపోయిన సోనూ సూద్​.. సెకండ్​ వేవ్​లోనూ తన ఔదార్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో పనులను చేసి చూపిస్తున్నారు. గత ఏడాది లాక్​డౌన్ లో ఎంతో మంది వలస కూలీలను సోనూ సూద్​ ఆదుకున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్​ మీడియా ఆయనకు నీరాజనాలు పట్టింది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనూ సూద్​ మరోసారి తన సేవా గుణాన్ని […]

మిస్​ కాల్​ ఇస్తే ఇంటికే ఆక్సిజన్​.. సోనూ సూద్ ఔదర్యం
X

కరోనా ఫస్ట్​వేవ్​, లాక్​డౌన్ టైంలో హీరోగా మారిపోయిన సోనూ సూద్​.. సెకండ్​ వేవ్​లోనూ తన ఔదార్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో పనులను చేసి చూపిస్తున్నారు. గత ఏడాది లాక్​డౌన్ లో ఎంతో మంది వలస కూలీలను సోనూ సూద్​ ఆదుకున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్​ మీడియా ఆయనకు నీరాజనాలు పట్టింది.

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనూ సూద్​ మరోసారి తన సేవా గుణాన్ని చాటుతున్నారు. ఆక్సిజన్​ కావాలంటూ ఎవరైనా సోషల్​ మీడియాలో అడిగినా.. లేదంటే ఆ సమస్య సోనూ సూద్​ దృష్టికి వ‌చ్చినా.. ఆయన వెంట‌నే సాయం చేస్తున్నారు. అంతేకాక సోనూ సూద్ ఫౌండేషన్​ పేరిట ఓ సంస్థను నెలకొల్పి సాయాన్ని కొనసాగిస్తున్నారు.

కరోనా సెకండ్​ వేవ్​ ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో చాలా మంది ఆక్సిజన్ దొరకక ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఢిల్లీలోని కరోనా బాధితులకు ఆక్సిజన్​ అందజేసేందుకు సోనూ సూద్​ తనవంతు కృషి చేస్తున్నారు. తుష్టి ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఢిల్లీలో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

ఆ మేరకు ఓ నంబర్​ కూడా సోనూ ఇచ్చారు. ఆక్సిజన్​ కావాల్సిన వాళ్లు 02261403615 నంబర్‌కు మిస్‌ కాల్‌ ఇస్తే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌ వారి వద్దకు చేర్చుతామని సోనూసూద్‌ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇదంతా ఉచితంగానే చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఢిల్లీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఆక్సిజన్​ అవసరం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఆక్సిజన్​ కాన్‌సెంట్రేటర్‌లను ఏర్పాటు చేశారు. ‘ ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేయడం ఎంతో మంచి పని అని పెద్దలు చెబుతుంటారు. అందుకే నేను సాయం చేస్తున్నా.

పేద ప్రజలు, ఆక్సిజన్​ అవసరం ఉన్నవాళ్లు ఎవరైనా సరే మేము ఇచ్చిన నంబర్​కు ఫోన్​చేసి మీ వివరాలు పంపించండి. వెంటనే మీకు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్‌ మీ ఇంటికి లేదా కోవిడ్​ సెంటర్​కు పంపిస్తాము. మీకు దానితో అవసరం తీరితే మళ్లీ మాకు కబురుపెట్టండి. మేము తీసుకెళ్తాం. మరొకరికి అది ఉపయోగపడుతుంది’ అంటూ సోనూ సూద్​ ట్వీట్​ చేశారు.

First Published:  16 May 2021 4:23 PM IST
Next Story