బ్రిటన్ బాటలో.. భారతీయ సంపన్నులు..
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2020 నాటికి భారత్ అవతల, అంటే విదేశాల్లో నివశిస్తున్న భారతీయుల సంఖ్య 1.8కోట్లు. యూఏఈలో 35 లక్షల మంది, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, ఖతర్, బ్రిటన్ లకు కూడా భారీ సంఖ్యలోనే మనోళ్లు వలస వెళ్లారు. అక్కడే స్థిరనివాసాలు ఏర్పరచుకున్న సూపర్ రిచ్ వర్గం కూడా ఇందులో ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారతీయులే అత్యధికంగా సొంత […]
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2020 నాటికి భారత్ అవతల, అంటే విదేశాల్లో నివశిస్తున్న భారతీయుల సంఖ్య 1.8కోట్లు. యూఏఈలో 35 లక్షల మంది, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, ఖతర్, బ్రిటన్ లకు కూడా భారీ సంఖ్యలోనే మనోళ్లు వలస వెళ్లారు. అక్కడే స్థిరనివాసాలు ఏర్పరచుకున్న సూపర్ రిచ్ వర్గం కూడా ఇందులో ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారతీయులే అత్యధికంగా సొంత దేశం వదిలిపెట్టి ఇతర దేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 40 శాతం పెరిగిందని న్యాయవాదులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.
ఎందుకీ వలస..?
కరోనా తొలి విడతలో భారత్ అత్యంత సురక్షిత దేశంగా ప్రచారం జరిగింది. చాలామంది విదేశాల్లో ఇరుక్కుపోయి, రవాణా సౌకర్యాలు లేక బాగా ఇబ్బంది పడ్డారు. సెకండ్ వేవ్ వచ్చేనాటికి భారత్ ప్రపంచ దేశాలకు ఓ బూచిలా మారిపోయింది. ఇతర దేశాలన్నీ మనపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఓ దశలో కొత్త వేరియంట్ వస్తుందేమోనన్న భయంతో, తమ సొంత దేశ పౌరుల్ని కూడా కాదనుకుని ప్రయాణాలపై నిషేధం విధించాయి ఆస్ట్రేలియా వంటి దేశాలు. ఈ సమయంలో భారత్ లో ఉండటం కంటే విదేశాల్లోనే తలదాచుకోవడమే ఉత్తమం అని అనుకున్నారు ఎన్నారైలు. కరోనా కల్లోలం తర్వాతే ఇండియాకు రావాలనుకుంటున్నారు.
విదేశాల్లో వ్యాక్సినేషన్ మొదలైన కొత్తల్లో.. కొంతమంది సంపన్నులు కేవలం టీకా కోసమే బ్రిటన్ వంటి దేశాలు వెళ్లిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే భారత్ లో లేని భద్రత, మెరుగైన హెల్త్ కేర్ సర్వీస్, బెటర్ లైఫ్ స్టెయిల్ కోసం భారతీయ సంపన్నులు, కార్పొరేట్ సంస్థల అధినేతలు, నిపుణులు విదేశాల వైపు, ప్రత్యేకించి బ్రిటన్ వైపు చూస్తున్నారనే విషయం అర్థమవుతోంది. బ్రిటన్ తోపాటు కెనడా, సైప్రస్, మాల్టా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలు భారతీయ సంపన్నులు, ప్రముఖులు, నిపుణులకు అత్యంత సానుకూల కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సూపర్ రిచ్ వర్గం అంతా.. తమ బిజినెస్ లను విదేశాల్లో స్థాపించి కొనసాగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. జర్మనీ, స్పెయిన్, పోలండ్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీరంతా ఆసక్తి చూపుతున్నారట.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగిన తర్వాత వివిధ దేశాల ఇన్వెస్టర్లు, నిపుణులైన వర్కర్లకు బ్రిటన్ లో అవకాశాలు బాగా పెరిగాయి. ప్రత్యేకమైన వీసాపై బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్వెస్టర్లు, స్కిల్డ్ వర్క్ వీసా అందుకున్న వారికి కూడా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ విడిచి వెళ్లేందుకే చాలామంది ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.