Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా ఆగలేదంటున్న నాగ్

ఓసారి స్పష్టత ఇచ్చిన తర్వాత మరోసారి అదే పుకారు రిపీట్ అవ్వదు. అది సహజం. ఇవ్వాల్సిన వ్యక్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక పుకారుకు ఆస్కారం ఉండదు. కానీ అదేంటో నాగార్జున విషయంలో మాత్రం ఒకే పుకారు మళ్లీ మళ్లీ తెరపైకొస్తోంది. ఇదివరకే ఓసారి నాగ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా మరోసారి ఆ రూమర్ వైరల్ అవుతోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాగార్జున అంగీకరించారు. ఆ మేరకు […]

ఆ సినిమా ఆగలేదంటున్న నాగ్
X

ఓసారి స్పష్టత ఇచ్చిన తర్వాత మరోసారి అదే పుకారు రిపీట్ అవ్వదు. అది సహజం. ఇవ్వాల్సిన వ్యక్తి
క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక పుకారుకు ఆస్కారం ఉండదు. కానీ అదేంటో నాగార్జున విషయంలో మాత్రం
ఒకే పుకారు మళ్లీ మళ్లీ తెరపైకొస్తోంది. ఇదివరకే ఓసారి నాగ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా మరోసారి
ఆ రూమర్ వైరల్ అవుతోంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాగార్జున
అంగీకరించారు. ఆ మేరకు గతంలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే అంతలోనే ఆ సినిమా
ఆగిపోయిందంటూ పుకార్లు వచ్చాయి. వైల్డ్ డాగ్ రిలీజ్ సందర్భంగా ఆ పుకార్లపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు
నాగార్జున.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఆగిపోలేదని, ఇంకా చెప్పాలంటే ఆ సినిమా కోసమే
ఇప్పుడు కొత్తగా మేకోవర్ అవుతున్నానని కూడా స్పష్టంచేశాడు. ఈ క్లారిటీ ఇచ్చి 2 నెలలైనా కాకముందే
ఇప్పుడు మళ్లీ అదే పుకారు ఫ్రెష్ గా తెరపైకొచ్చింది.

నాగార్జున-ప్రవీణ్ సత్తారు సినిమా ఆగిపోయిందంటూ మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. దీంతో నాగార్జున
మరోసారి స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. తన నెక్ట్స్ మూవీ ప్రవీణ్ సత్తారుతోనే ఉంటుందని ప్రకటించాడు ఈ
సీనియర్ హీరో.

First Published:  16 May 2021 11:37 AM IST
Next Story