Telugu Global
Cinema & Entertainment

అనుష్క ఫొటో చూసి మోసపోవద్దు

2 రోజులుగా సోషల్ మీడియాలో అనుష్క ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అదేదో అందంగా ఉందని వైరల్ అవ్వడం లేదు. అందులో అనుష్క చాలా లావుగా ఉంది. దీంతో ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు పుట్టుకొచ్చాయి. అలా ఆ ఫొటో వైరల్ అయింది. అసలు ఆ ఫొటో ఎలా బయటకొచ్చిందో ముందు చూద్దాం. అనుష్కకు చెందిన అఫీషియల్ సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఆ ఫొటోను రిలీజ్ చేసింది. చాన్నాళ్లుగా అనుష్క నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో […]

అనుష్క ఫొటో చూసి మోసపోవద్దు
X

2 రోజులుగా సోషల్ మీడియాలో అనుష్క ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అదేదో అందంగా ఉందని వైరల్
అవ్వడం లేదు. అందులో అనుష్క చాలా లావుగా ఉంది. దీంతో ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు
పుట్టుకొచ్చాయి. అలా ఆ ఫొటో వైరల్ అయింది.

అసలు ఆ ఫొటో ఎలా బయటకొచ్చిందో ముందు చూద్దాం. అనుష్కకు చెందిన అఫీషియల్ సోషల్
మీడియా గ్రూప్ ఒకటి ఆ ఫొటోను రిలీజ్ చేసింది. చాన్నాళ్లుగా అనుష్క నుంచి ఎలాంటి అప్ డేట్స్
లేకపోవడంతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసేందుకు ఆ ఫొటో వదలింది.

అయితే అది చూసి చాలామంది అనుష్క లేటెస్ట్ స్టిల్ అనుకున్నారు. ఈమధ్య ఏడాదిగా ఇంట్లోనే
కసరత్తులు చేస్తూ, కఠినమైన డైట్ ఫాలో అవుతూ అనుష్క బరువు తగ్గినట్టు కథనాలు వచ్చాయి. అలాంటి
టైమ్ లో వచ్చిన ఈ ఫొటోలో అనుష్క చాలా లావుగా ఉండడం చూసి చాలామంది కామెంట్స్ చేశారు.

ఊహించని విధంగా వచ్చిన విమర్శలతో ఉక్కిరిబిక్కిరైంది అనుష్క టీమ్. వెంటనే ఆ ఫొటోపై క్లారిటీ
ఇచ్చింది. అది రీసెంట్ ఫొటో కాదని, ఏడాదిన్నర కిందట అనుష్క ఉత్తరాది పర్యటనకు వెళ్లినప్పుడు
తీసిన ఫొటో అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  16 May 2021 11:41 AM IST
Next Story