తుక్కు తుక్కయిపోయిన స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్.. " ఎంపీ విజయసాయిరెడ్డి
దేశవ్యాప్తంగా రాజకీయాల్లో వారసులు రాణిస్తుంటే.. ఏపీలో మాత్రం 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు, స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్.. నారా లోకేష్ రాజకీయాల్లో తుక్కు తుక్కు అయిపోయారంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ” వైఎస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. కేసీఆర్ కుమారుడు గెలిచారు. ములాయం కుమారుడు గెలిచారు. థాక్రే కుమారుడు గెలిచారు. 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తారు.” అంటూ […]
దేశవ్యాప్తంగా రాజకీయాల్లో వారసులు రాణిస్తుంటే.. ఏపీలో మాత్రం 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు, స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్.. నారా లోకేష్ రాజకీయాల్లో తుక్కు తుక్కు అయిపోయారంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
” వైఎస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. కేసీఆర్ కుమారుడు గెలిచారు. ములాయం కుమారుడు గెలిచారు. థాక్రే కుమారుడు గెలిచారు. 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తారు.” అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు విజయసాయిరెడ్డి.
ఏపీలో కరోనా కేసులు పెరగడానికి చంద్రబాబే కారణం..
జగన్ ప్రభుత్వం వద్దని మొత్తుకుంటున్నా కట్టప్ప లాంటి నిమ్మగడ్డను వాడుకుని చంద్రబాబు ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగేలా చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. కరోనా వ్యాప్తికి కుట్ర పన్నిన పాపం ఆయనను, పచ్చ బ్యాచ్ ని వదిలి పెట్టదని అన్నారు. ఏపీలో స్థానికి ఎన్నికలు జరగకపోయి ఉంటే.. పాజిటివ్ కేసుల్లో రాష్ట్రం చిట్ట చివరన ఉండేదని, ఆందోళనకర పరిస్థితులు వచ్చేవి కాదని చెప్పారు.
కేంద్రాన్ని విమర్శించే ధైర్యం లేదు కానీ..
వ్యాక్సినేషన్ లోపాలు, ఆక్సిజన్ సరఫరాలో అలసత్వంపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేక, చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ” అగ్గి ఎక్కడ ఉందో అక్కడ నీళ్లు చల్లాలి. ఢిల్లీ వైపు చూసే ధైర్యం లేక రాష్ట్రంలో నీళ్లు కుమ్మరిస్తే జారి పడతావ్ చంద్రబాబు. ఇప్పటికే మోకాళ్లు విరగ్గొట్టుకుని నడవలేక పాకుతున్నావ్. మంచం పాలు కాకుండా చూసుకో. విశ్వసనీయత కోల్పోయాక గారడీలు చేసినా, నాటకాలాడినా వృథా ప్రయాస అవుతుంది.” అని ట్వీట్ చేశారు. రిజెక్టెడ్, డిజెక్టెడ్ తండ్రీకొడుకుల ద్వయానికి ఏపీలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలతో గుండె పగిలిందని, కష్టకాలంలో కూడా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఆగే సమస్యే లేదు కాబట్టి.. తండ్రీకొడుకుల కడుపుమంట ఎప్పటికీ చల్లారదని ఎద్దేవా చేశారు.