Telugu Global
NEWS

రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆయన అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ఎంపీని సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని ఆదేశించింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిన్న‌రాత్రి హైకోర్టులో హౌస్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ లేకుండా ఎంపీని అరెస్టు చేశారంటూ ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకి […]

రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
X

ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆయన అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ఎంపీని సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని ఆదేశించింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిన్న‌రాత్రి హైకోర్టులో హౌస్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ లేకుండా ఎంపీని అరెస్టు చేశారంటూ ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ముందుగా జిల్లా కోర్టును ఎందుకు ఆశ్ర‌యించ‌లేద‌ని ప్రశ్నించింది. కింది కోర్టుని ఆశ్రయించాలని సూచిస్తూ బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది.

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టకు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభియోగాల‌తో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును సీఐడీ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ లో ఆయ‌న‌ను అరెస్టు చేసి గుంటూరుకి తరలించారు. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేశారు. A1 గా రఘురామకృష్ణంరాజు, A2 గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానల్‌ ను.. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎంపీ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్న సీఐడీ అధికారులు ఆయనపై 124 ఏ, 153 ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నిన్న రాత్రి నుంచి సీఐడీ కార్యాలయంలోనే ఉన్న రఘురామ కృష్ణంరాజుపై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. అద‌న‌పు డీజీ సునీల్‌ కుమార్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వంపై ఆయ‌న చేస్తున్న విమర్శలకు సంబంధించి సమాచారం ఎవరు అందిస్తున్నారు, సాంకేతిక స‌హ‌కారం ఎవ‌రిస్తున్నార‌ని ప్ర‌శ్న‌లు వేశారు. ఎవరు సహకరిస్తున్నారని అడిగారు.

First Published:  15 May 2021 10:15 AM IST
Next Story