Telugu Global
NEWS

తుపాన్‌ ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో చల్లబడ్డ వాతావరణం..

ఓవైపు కరోనా కల్లోలం వెంటాడుతుంటే, మరోవైపు తౌక్టే తుపాన్‌ ముంచుకొస్తోంది. అయితే దీని ప్రభావం కేరళపై అత్యథికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ విభాగం అధికారులు. తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆకాశం మేఘావృతమై, ఉష్ణోగ్రతలు తగ్గాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంపై తౌక్టే తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. దక్షిణ కోస్తాతోపాటు, రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం తుపాన్‌ తీరం దాటే వరకు దీని ప్రభావం […]

తుపాన్‌ ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో చల్లబడ్డ వాతావరణం..
X

ఓవైపు కరోనా కల్లోలం వెంటాడుతుంటే, మరోవైపు తౌక్టే తుపాన్‌ ముంచుకొస్తోంది. అయితే దీని ప్రభావం కేరళపై అత్యథికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ విభాగం అధికారులు. తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆకాశం మేఘావృతమై, ఉష్ణోగ్రతలు తగ్గాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంపై తౌక్టే తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. దక్షిణ కోస్తాతోపాటు, రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం తుపాన్‌ తీరం దాటే వరకు దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు.

లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుపాన్‌ గా మారింది. ఈనెల 18న గుజరాత్‌ వద్ద ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో 53 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.

కేరళపై మొదలైన ప్రభావం..
తుపాన్‌ ధాటికి ఇప్పటికే కేరళ లోని కొల్లాం జిల్లాలో అనేకచోట్ల చెట్లు నేలకూలాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్‌, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే కరోనా విధుల్లో అధికారులు తలమునకలై ఉన్నారు. లాక్ డౌన్ ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తుపాన్‌ ప్రభావం మొదలవడంతో.. సహాయక చర్యలకోసం సిద్ధమవుతున్నారు. తీర ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. తుపాన్‌ ప్రభావంతో, తీర ప్రాంత వాసుల్ని, బాధితుల్ని తరలించే క్రమంలో వైరస్ వ్యాప్తి మరింత పెరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అటు ఆక్సిజన్ సరఫరాపై తుపాన్‌ ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

First Published:  14 May 2021 11:58 PM GMT
Next Story