Telugu Global
NEWS

ఏపీలో పది పరీక్షలు యధాతథం..

ఏపీలో పదో తరగతి పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడటంతో.. పదో తరగతి పరీక్షలపై కూడా ప్రభుత్వం పునరాలోచిస్తుందని అనుకున్నారంతా. అయితే మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం పది పరీక్షలు జూన్-7నుంచి ప్రారంభం అవుతాయని తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిళ్లుతుందని…విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని ఆయన […]

ఏపీలో పది పరీక్షలు యధాతథం..
X

ఏపీలో పదో తరగతి పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడటంతో.. పదో తరగతి పరీక్షలపై కూడా ప్రభుత్వం పునరాలోచిస్తుందని అనుకున్నారంతా. అయితే మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం పది పరీక్షలు జూన్-7నుంచి ప్రారంభం అవుతాయని తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిళ్లుతుందని…విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారాయన. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని, ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వాలని సూచించారు.

జూన్ 1నుంచి కసరత్తు..
జూన్-1 నుంచి పదో తరగతి పరీక్షలకు సంబంధించిన కసరత్తు మొదలు కాబోతోంది. ఈమేరకు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులంతా జూన్-1 స్కూళ్లకి తిరిగి హాజరవుతారని మంత్రి తెలిపారు. జూన్ 7నుంచి 16 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్‌ 7 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ , జూన్‌ 8 సెకండ్‌ లాంగ్వేజ్‌, జూన్‌ 9 ఇంగ్లిష్‌, జూన్‌ 10 గణితం, జూన్‌ 11 ఫిజికల్‌ సైన్స్‌, జూన్‌ 12 బయోలాజికల్‌ సైన్స్‌, జూన్‌ 14 సోషల్‌ స్టడీస్‌.. పరీక్ష జరగాల్సి ఉంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు వరకు పరీక్షలు జరుగుతాయి. అన్ని సబ్జెక్టులకు 3 గంటల 15 నిమిషాలుగా పరీక్ష సమయాన్ని నిర్ణయించగా, సైన్స్ సబ్జెక్ట్ లకు మాత్రం 2 గంటల 45 నిమిషాలు కేటాయించారు.

పది పరీక్షలు సజావుగా జరిగితే.. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈనెల 5నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, కోర్టు సూచనలతో ప్రభుత్వం వాటిని వాయిదా వేసింది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. పది పరీక్షల విషయంలో అన్నీ సజావుగా సాగితే.. ఆ వెంటనే ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది.

First Published:  15 May 2021 3:50 PM IST
Next Story