Telugu Global
National

వ్యాక్సినేషన్ కు మూడేళ్లు పడుతుందా?

కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఈ ఏడాది చివరకి థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో ప్రజలందరికీ టీకాలు వేయడమే ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్. అయితే దేశమంతటికీ టీకాలు వేయాలంటే మరో రెండు, మూడేళ్లు పడుతుందంట. అదెలాగంటే.. రోజుకు సగటున 20.94 లక్షల మోతాదులో 75 శాతం జనాభాకు టీకాలు ఇవ్వడానికి భారతదేశానికి మరో 2.5 సంవత్సరాలు పడుతుందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఇది అమెరికా, యూకే లాంటి దేశాల […]

వ్యాక్సినేషన్ కు మూడేళ్లు పడుతుందా?
X

కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఈ ఏడాది చివరకి థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో ప్రజలందరికీ టీకాలు వేయడమే ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్. అయితే దేశమంతటికీ టీకాలు వేయాలంటే మరో రెండు, మూడేళ్లు పడుతుందంట. అదెలాగంటే..

రోజుకు సగటున 20.94 లక్షల మోతాదులో 75 శాతం జనాభాకు టీకాలు ఇవ్వడానికి భారతదేశానికి మరో 2.5 సంవత్సరాలు పడుతుందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఇది అమెరికా, యూకే లాంటి దేశాల కంటే చాలా ఎక్కువ.

ఉదాహరణకు యుఎస్, యూకే.. ఈ రెండు దేశాలు వారి జనాభాలో 75 శాతం టీకాలు వేయడానికి మూడు నెలల సమయం మాత్రమే తీసుకుంటాయని భావిస్తున్నారు. అదేవిధంగా, కెనడా, జర్మనీ, ఇటలీకి మరో నాలుగు నెలలు అవసరం. అలాగే ఫ్రాన్స్ జనాభాలో 75 శాతం మందికి టీకాలు ఇవ్వడానికి మరో ఐదు నెలలు పడుతుంది.

ప్రస్తుతం భారతదేశ జనాభాలో 75 శాతం అంటే 94.5 కోట్లు. ఇంతమందికి కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ యొక్క రెండు షాట్లు ఇవ్వవలసి ఉంది. అంటే మొత్తంగా 189 కోట్ల వ్యాక్సిన్ మోతాదు అవసరం. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ స్పీడ్ రోజుకి 20.94 లక్షలు. ఈ రోజు వరకు రాష్ట్రాలకు దాదాపు 19 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందించారు. టీకా డ్రైవ్ 115 రోజులుగా జరుగుతుంది. అంటే సగటున రోజువారీ సరఫరా 15 నుంచి 20 లక్షల మధ్య ఉంది. ఇలా ప్రతి నెలా 4.5 కోట్ల వ్యాక్సిన్స్ వేస్తూ పోతే.. 189 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేయడానికి రెండు మూడేళ్లు పడుతుందని లెక్కలు చెప్తున్నాయి.

ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యాక్సినేషన్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాయి. భారత్, చైనా మినహాయించి మిగతా ప్రపంచదేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది. కాబట్టి వారి దేశ జనాభాలో 75శాతం మందికి వ్యాక్సినేషన్ చేయడానికి మనకంటే తక్కువే సమయమే పడుతుంది. రోజుకు పది లక్షల లోపు టీకాలు వేసినా ఐదారు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. కానీ 130కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశానికి ఇది చాలా కష్టంగా మారింది. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేయాలి. వ్యాక్సినేషన్ స్పీడ్ ను పెంచాలి. వ్యాక్సినేషన్ సెంటర్లను, సిబ్బందిని ఇలా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఏదేమైనా వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సినేషన్ స్పీడ్.. మరో వైపు వేవ్స్ రూపంలో వచ్చి పడుతున్న కరోనా జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడతున్నాయి.

First Published:  15 May 2021 8:15 AM IST
Next Story