Telugu Global
NEWS

చంద్రబాబు పాపం.. ఏపీకి శాపం..

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపడంపై టీడీపీ నీఛ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో సదుపాయాలు లేకపోవడం వల్లే రోగులు హైదరాబాద్ వెళ్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే ప్రజలు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిపై హక్కు కోల్పోయారని […]

చంద్రబాబు పాపం.. ఏపీకి శాపం..
X

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపడంపై టీడీపీ నీఛ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో సదుపాయాలు లేకపోవడం వల్లే రోగులు హైదరాబాద్ వెళ్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే ప్రజలు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిపై హక్కు కోల్పోయారని సజ్జల ఆరోపించారు. 2024 వరకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని, అయితే చంద్రబాబు ఇక్కడికి రావడం వల్లే ప్రజలు అవకాశాన్ని కోల్పోయారని చెప్పారు.

ప్రజలు మెడికల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్కువగా ఉన్న నగరాలకు వెళ్లడం సహజమని, గత ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయకపోవడం వల్లే ఇప్పుడీ సమస్య తలెత్తిందని విమర్శించారు సజ్జల. ఎక్కడా రాని సమస్య తెలంగాణ సరిహద్దుల్లోనే వస్తుందని, ఇది మానవత్వంతో చూడాల్సిన అంశమని చెప్పారు. ఏపీ నుంచి కొవిడ్ బాధితులు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు ఏపీ వాసులకు ఇబ్బంది కలిగించడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు.

తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరమని అన్న సజ్జల, అంబులెన్స్‌ లు ఆపొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇది జాతీయ విపత్తు అని, దీనిపై సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టిందని గుర్తు చేశారు. ఆస్పత్రి లెటర్‌, పాస్‌లు తీసుకురావడం సాధ్యం కాదని తెలిపారు.

First Published:  14 May 2021 9:45 AM GMT
Next Story