Telugu Global
National

కమల్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ

స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానంటూ విశ్వనటుడు కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్రంలో మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కొత్తలోనే లోక్ సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసింది. నాలుగు శాతం ఓట్లు సాధించి మెరుగైన ఫలితాన్నే సాధించింది. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని కమల్ హాసన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తన పార్టీ తరపున మేధావులు, సామాజిక ఉద్యమకారులు, మాజీ ఐఏఎస్ […]

కమల్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ
X

స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానంటూ విశ్వనటుడు కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్రంలో మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కొత్తలోనే లోక్ సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసింది. నాలుగు శాతం ఓట్లు సాధించి మెరుగైన ఫలితాన్నే సాధించింది. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని కమల్ హాసన్ ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తన పార్టీ తరపున మేధావులు, సామాజిక ఉద్యమకారులు, మాజీ ఐఏఎస్ లకు సీట్లు ఇచ్చి పోటీ చేయించారు. అయితే మక్కల్ నీది మయ్యం రాష్ట్రంలో ఒక్క స్థానంలో కూడా గెలవలేక పోయింది. చివరికి కమల్ హాసన్ కూడా దక్షిణ కోవై నుంచి బరిలోకి దిగి ఓటమి చెందారు.

అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు నిష్క్రమించడం ప్రారంభించారు. ముందుగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వెళ్తూవెళ్తూ కమల్ హాసన్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని ఇలాగే నడుపుతుంటే ఇక ఎప్పటికీ గెలవలేదంటూ వ్యాఖ్యానించారు.

తాజాగా ఆ పార్టీకి మరో ఇద్దరు నేతలు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో మాజీ ఐఏఎస్ అధికారి సంతోష్ బాబు, సామాజికవేత్త పద్మప్రియ ఉన్నారు. మక్కల్ నీది మయ్యంలో మహేంద్ర తర్వాత కీలకంగా వ్యవహరించింది సంతోష్ బాబే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం తరఫున పోటీచేసిన వీరిద్దరూ ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంఎన్ఎం కీలక నేతలందరూ ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. మరోవైపు కమల్ హాసన్ ఎన్నికల్లో ఓటమికి తీవ్ర నిరాశ చెందారని, ఆయన ఇక రాజకీయాలు మాని సినిమాలకే పరిమితం అవుతారని తమిళనాట ప్రచారం జరుగుతోంది.

First Published:  14 May 2021 7:20 AM IST
Next Story