Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలో ఒకే రోజు ఐదు సినిమాలు..!

ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త బొమ్మ పడేది. ఇక పండగో పబ్బమో వస్తే చాలు కొత్త సినిమాలతో థియేటర్లన్నీ కళకళలాడేవి. అయితే కరోనా సంక్షోభం మొదలైన తర్వాత సినీ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కరోనా వల్ల షూటింగులు చేయడానికి కుదరడం లేదు. థియేటర్లు కూడా అన్ని మూతపడ్డాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా సినిమాలు ప్రదర్శించే అమెజాన్, నెట్ […]

ఓటీటీలో ఒకే రోజు ఐదు సినిమాలు..!
X

ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త బొమ్మ పడేది. ఇక పండగో పబ్బమో వస్తే చాలు కొత్త సినిమాలతో థియేటర్లన్నీ కళకళలాడేవి. అయితే కరోనా సంక్షోభం మొదలైన తర్వాత సినీ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.

కరోనా వల్ల షూటింగులు చేయడానికి కుదరడం లేదు. థియేటర్లు కూడా అన్ని మూతపడ్డాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా సినిమాలు ప్రదర్శించే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీ యాప్ లకు డిమాండ్ పెరిగింది.

షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల కాని సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీకి క్యూ కడుతున్నాయి.

ఇవాళ ఒక్కరోజే ఓటీటీలో ఐదు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఈ న్యూస్ సినీ ప్రేక్షకుల్లో జోష్ నింపింది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన చిత్రం ‘విజయ్ సేతుపతి’. ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకత్వం వహించగా రాశీఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఇవాళ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అలాగే మరో తమిళ హీరో ధనుష్ నటించిన కర్ణన్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో నేటి నుంచి ప్రసారం కానుంది. గత నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు డైరెక్టర్ ప్రవీణ్ కండ్రిగుల తెరకెక్కించిన చిత్రం ‘సినిమా బండి’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఇవాళ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

యంగ్ హీరో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ మూవీ సన్ నెక్స్ట్ యాప్ లో ప్రసారం కానుంది. దీంతోపాటు రామ్ నారాయణ డైరెక్షన్ లో అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక,లావణ్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘బట్టల రామస్వామి’ బయోపిక్ జీ 5లో ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీ కంపెనీ ‘ మూవీ కూడా స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మే 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఓటీటీలో ఒకే రోజు ఐదు సినిమాలు విడుదల అవుతుండటంతో సినీ అభిమానుల కోలాహలం నెలకొంది.

First Published:  14 May 2021 11:05 AM IST
Next Story