Telugu Global
National

గంగా నదిలోకి మృతదేహాలు.. మానవహక్కుల కమిషన్​ సీరియస్​..!

గంగానదిలోకి మృతదేహాలు కొట్టుకొని వచ్చిన ఘటన ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అవి కోవిడ్​ మృతదేహాలు కావచ్చని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దాదాపు 52 మృతదేహాలు గంగానదిలోకి కొట్టుకొని వచ్చాయి. ఘటనపై కేంద్ర మానవహక్కుల కమిషన్​ సీరియస్​ అయ్యింది. బీహార్​, యూపీ ప్రభుత్వాలపై కన్నెర్ర జేసింది. మృతదేహాలు కొట్టుకొచ్చిన ఘటనకు సంబంధించి.. ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కేంద్ర మానవహక్కుల […]

గంగా నదిలోకి మృతదేహాలు.. మానవహక్కుల కమిషన్​ సీరియస్​..!
X

గంగానదిలోకి మృతదేహాలు కొట్టుకొని వచ్చిన ఘటన ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అవి కోవిడ్​ మృతదేహాలు కావచ్చని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దాదాపు 52 మృతదేహాలు గంగానదిలోకి కొట్టుకొని వచ్చాయి.
ఘటనపై కేంద్ర మానవహక్కుల కమిషన్​ సీరియస్​ అయ్యింది.

బీహార్​, యూపీ ప్రభుత్వాలపై కన్నెర్ర జేసింది. మృతదేహాలు కొట్టుకొచ్చిన ఘటనకు సంబంధించి.. ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కేంద్ర మానవహక్కుల కమిషన్​ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై నాలుగు వారాల్లోపు నివేదికను అందించాలని ఆదేశించింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో దాదాపు 52 మృతదేహాలు గంగా నదిలో కొట్టుకొచ్చాయి. ఉజియార్, కల్హాదియా, బరౌలి ప్రాంతాల్లోని గంగా నది తీరాల్లోకి, బిహార్‌లోని చౌసా పట్టణంలో ఉన్న గంగా నది తీరానికి దాదాపు 71 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

అంతర్జాతీయ స్థాయిలోనూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై ప్రపంచమీడియా దుమ్మెత్తి పోస్తున్నది. సకాలంలో టీకాలు వేయించకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇదే టైంలో గంగానదిలోకి మృతదేహాలు కొట్టుకురావడం మరింత సంచలనంగా మారింది.

ఓ వైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కొరత వేధిస్తున్నది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. కేవలం ఆక్సిజన్​ దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు శ్మశానాల వద్ద శవాలతో క్యూ కనిపిస్తున్నది.

ఇటువంటి పరిస్థితుల్లో గంగా నదిలోకి మృతదేహాలు కొట్టుకొచ్చాయి. శ్మశానాలకు తీసుకెళ్లి అక్కడ దహనం చేయించలేని పేదలు.. మృతదేహాలను ఇక్కడ వదిలేసి వెళ్లి ఉంటారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
తాజాగా ఈ అంశంపై కేంద్ర మానవహక్కుల కమిషన్​ సీరియస్​ అయ్యింది.

First Published:  14 May 2021 4:43 PM IST
Next Story