మూవీ రివ్యూ: సినిమా బండి
నటీనటులు – వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి దర్శకత్వం – ప్రవీణ్ కండ్రేగుల నిర్మాతలు – రాజ్, డీకే సంగీతం – శిరీష్ డీవోపీ – అపూర్వ, సాగర్ వేదిక – నెట్ ఫ్లిక్స్ రిలీజ్ డేట్ – మే 14, 2021 రేటింగ్ – 2/5 మలయాళ సినిమాలు చాలా సహజంగా ఉంటాయి. ఆ సహజత్వాన్ని తెలుగులో కూడా చూపించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ సమస్యంతా ఎక్కడొస్తోందంటే, లొకేషన్లు, పాత్రలతోనే సహజత్వం వచ్చేస్తుందనే భ్రమలో ఉన్నారు […]
నటీనటులు – వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి
దర్శకత్వం – ప్రవీణ్ కండ్రేగుల
నిర్మాతలు – రాజ్, డీకే
సంగీతం – శిరీష్
డీవోపీ – అపూర్వ, సాగర్
వేదిక – నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్ – మే 14, 2021
రేటింగ్ – 2/5
మలయాళ సినిమాలు చాలా సహజంగా ఉంటాయి. ఆ సహజత్వాన్ని తెలుగులో కూడా చూపించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ సమస్యంతా ఎక్కడొస్తోందంటే, లొకేషన్లు, పాత్రలతోనే సహజత్వం వచ్చేస్తుందనే భ్రమలో ఉన్నారు చాలామంది తెలుగు మేకర్స్. మలయాళ కథల్లో ఉన్న సహజత్వాన్ని పట్టలేకపోతున్నారు. అలా నేచురాలిటీ పేరిటి చేతులు కాల్చుకున్న ఉదంతమే ఈ సినిమా బండి.
రాయలసీమలోనే ఓ పల్లెటూరిలో, కాస్త తక్కువ చదువుకున్న ఓ ఆటోడ్రైవర్ ఉంటాడు. అతడి ఆటోలో ప్రయాణించిన ఓ కస్టమర్, పొరపాటున ఖరీదైన సోనీ కెమెరాను మరిచిపోతాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లిన సదరు ఆటోడ్రైవర్ అమ్మాలని చూస్తాడు. కానీ చివరికి వచ్చేసరికి దాంతో సినిమా తీద్దాం అనుకుంటాడు. ఆ సినిమాతో కోట్లు సంపాదించాలనేది అతడి కల. మరి చివరికి అతడు సినిమా తీశాడా లేదా అనేది ఈ సినిమా బండి కథ.
లైన్ చెప్పుకోవడానికి చాలా బాగుంది కానీ ఇందులోని అతిపెద్ద లాజిక్ ను దర్శకుడు మిస్సయ్యాడు. ప్రతి పల్లెటూరులోకి టీవీలు, మొబైల్ ఫోన్లు చొచ్చుకొచ్చేశాయి. ఇలాంటి రోజుల్లో ఆ కెమెరాతో సినిమా తీసి కోట్లు సంపాదించాలనుకోవడం భ్రమ. ఆ విషయాన్ని ఆటోడ్రైవర్ కు ఎవ్వరూ చెప్పరు. పైపెచ్చు ఏదో అంతరిక్షం నుంచి ఊడిపడ్డట్టు కెమెరాను అంతా వింతగా చూడడం కొసమెరుపు. ఇన్ని లాజిక్కులు మిస్ అయిన దర్శకుడు, కెమెరాను వాడే వ్యక్తిని మాత్రం చేయితిరిగిన శక్తిగా చూపించాడు. అతడితో చాలా కెమెరా యాంగిల్స్ ప్రదర్శింపజేశాడు. ఇదెక్కడి లాజిక్కో ఆ దర్శకుడికే తెలియాలి.
కనీసం ఈ కథను చిన్నపిల్లలతో పెట్టి తీసినా లాజికల్ గా సరిపోయేదు. మేకర్స్ అనుకున్న నేచురాలిటీ కాన్సెప్ట్ మరింత ఎలివేట్ అయ్యేది. కానీ అలా జరగలేదు. ప్రతి మనిషిలోనూ ఓ ఫిలిం మేకర్ ఉంటాడనే కాన్సెప్ట్ ను చెప్పాలనుకున్న దర్శకుడు.. ఆ విషయం చెప్పడానికి మరో రకమైన కథ అల్లుకుంటే బాగుండేది. ఈ సినిమా బండి మాత్రం కరెక్ట్ కాదు. ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో దీని కంటే బతుకు జట్కా బండి బెటర్ అనే కామెంట్స్ పడుతున్నాయి.
ఆటోడ్రైవర్ గా చేసిన వికాస్ వశిష్ట, బార్బర్ గా నటించిన రాగ్ నటన బాగుంది. మిగతా నటీనటుల గురించి, టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవడానికేం లేదు. నిర్మాతలు రాజ్-డీకే ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టినట్టు అనిపించదు. ఫైనల్ గా ఈ సినిమా ఓ మంచి ప్రయత్నంగా నిలుస్తుంది తప్ప ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అనిపించుకోదు.