Telugu Global
National

టీకాలే లేనప్పుడు డయలర్ టోన్ తో చిరాకెందుకు..?

ప్రజలకు టీకాలు వేసేందుకు ప్రభుత్వం వద్ద టీకాలు లేవు, మరి టీకాలు వేసుకోండి సురక్షితంగా ఉండండి అంటూ ప్రతి సారీ ఫోన్ చేసినప్పుడు వినిపించే డయలర్ టోన్ తో ఎందుకు విసిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. చిరాకు తెప్పించే ఈ సందేశాన్ని మార్చేయండి అంటూ ఆదేశాలిచ్చింది. జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లి తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. టీకాలే లేనప్పుడు ప్రజలు వాటిని ఎంలా పొందగలుగుతారని, డయలలర్ టోన్ […]

టీకాలే లేనప్పుడు డయలర్ టోన్ తో చిరాకెందుకు..?
X

ప్రజలకు టీకాలు వేసేందుకు ప్రభుత్వం వద్ద టీకాలు లేవు, మరి టీకాలు వేసుకోండి సురక్షితంగా ఉండండి అంటూ ప్రతి సారీ ఫోన్ చేసినప్పుడు వినిపించే డయలర్ టోన్ తో ఎందుకు విసిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. చిరాకు తెప్పించే ఈ సందేశాన్ని మార్చేయండి అంటూ ఆదేశాలిచ్చింది. జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లి తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. టీకాలే లేనప్పుడు ప్రజలు వాటిని ఎంలా పొందగలుగుతారని, డయలలర్ టోన్ తో టీకాలకు ప్రచారం ఎందుకని నిలదీసింది. ఉచితంగా కాకపోయినా కనీసం డబ్బులు తీసుకుని అయినా వ్యాక్సిన్లు అందరికీ అందించాలని చెప్పింది. వ్యాక్సిన్ తీసుకోండి అనే డయలర్ టోన్ ని మార్చాలని, దాని స్థానంలో ప్రజలకు అగాహన కల్పించే మరిన్ని సందేశాలు పెట్టాలని సూచించింది. ఆక్సిజన్‌ కాన్సన్ ట్రేటర్లు, సిలిండర్లు, టీకాలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిన్న టీవీ కార్యక్రమాలను రూపొందించాలని సూచించింది.

లాయర్లకు వ్యాక్సిన్లు ఎప్పుడిస్తారు..?
కరోనా ఉధృతి దృష్ట్యా జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని పెరోల్ పై విడుదల చేయాలని, ఇప్పటికే పెరోల్ పొందినవారిని తక్షణం జైళ్లనుంచి పంపించాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ ఆదేశాల అమలు కోసం పనిచేస్తున్న లాయర్లు, న్యాయాధికారుల్లో 18-44 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారని, వారికి నేరుగా టీకా వేసే అవకాశం ఉందా అని ఢిల్లీ హైకోర్టు ఆరా తీసింది. టీకాలివ్వకుండా వారికి బాధ్యతలు అప్పజెప్పడం అంటే.. తుపాకీ ఇవ్వకుండా యుద్ధానికి పంపించడమేనని మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలు కోసమే వారు పనిచేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు గుర్తు చేసింది. ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే లాయర్లు ఫ్రంట్ లైన్ వర్కర్లు కాదని, టీకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వలేమని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ న్యాయస్థానానికి తెలిపారు.

కనీసం న్యాయవాదులకు మొదటి డోస్ అయినా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ప్రాధాన్యత ప్రాతిపదికన న్యాయవాదులు మొదటి డోసు పొందినా కొంత ఉపశమనం ఉంటుంది కదా? వారికి మనం కనీసం ఇవ్వగలిగింది ఇవ్వాలి కదా అని వ్యాఖ్యానించింది. జైళ్లకు వెళ్లి.. బెయిలుకు దరఖాస్తు చేసేందుకు ఖైదీల అనుమతిని కోరేందుకు న్యాయ సేవా లాయర్లు, ఆ కేసులను విచారించే న్యాయాధికారులు చాలా ప్రత్యేక తరగతికి చెందినవారని కోర్టు వ్యాఖ్యానించింది. తమ జీవితాలను ప్రమాదంలో పడేసుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో వారు ఇళ్లకే పరిమితమైతే.. జైళ్లలో రద్దీని తగ్గించడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎవరు అమలు చేస్తారని ప్రశ్నించింది.

First Published:  14 May 2021 8:02 AM IST
Next Story