Telugu Global
Cinema & Entertainment

శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ ఇతడే

కొన్నేళ్ల కిందట బ్రిటన్ కు చెందిన కోర్సల్ తో ప్రేమలో పడింది శృతిహాసన్. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు డేటింగ్ చేశారు. తర్వాత విడిపోయారు. కోర్సల్ ను మరిచిపోవడానికి కాస్త టైమ్ తీసుకుంది శృతిహాసన్. అలా కోలుకున్న తర్వాత ఇప్పుడు మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో ప్రత్యక్షమైంది శృతిహాసన్. ఇతడి పేరు శాంతను హజారికా. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారనే విషయం చాలామందికి తెలుసు. అంతెందుకు కొన్నాళ్ల కిందట శృతిహాసనే స్వయంగా శాంతనుతో కలిసి దిగిన […]

శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ ఇతడే
X

కొన్నేళ్ల కిందట బ్రిటన్ కు చెందిన కోర్సల్ తో ప్రేమలో పడింది శృతిహాసన్. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు
డేటింగ్ చేశారు. తర్వాత విడిపోయారు. కోర్సల్ ను మరిచిపోవడానికి కాస్త టైమ్ తీసుకుంది శృతిహాసన్.
అలా కోలుకున్న తర్వాత ఇప్పుడు మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో ప్రత్యక్షమైంది శృతిహాసన్. ఇతడి పేరు
శాంతను హజారికా.

వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నారనే విషయం చాలామందికి తెలుసు. అంతెందుకు కొన్నాళ్ల
కిందట శృతిహాసనే స్వయంగా శాంతనుతో కలిసి దిగిన ఫొటోల్ని షేర్ చేసింది. ఇప్పుడు మరోసారి
శాంతను తనకు ఎంత క్లోజ్ అనే విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్.

ఈ లాక్ డౌన్ టైమ్ లో 24 గంటలు శాంతను తోనే ఉంటున్నానని స్పష్టంచేసింది శృతిహాసన్. ప్రస్తుతం
అన్ని పనులు కలిసే చేస్తున్నామని.. శాంతను పక్కన ఉంటే టైమ్ తెలియడం లేదని అంటోంది. ఇలా
తన కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతను అనే విషయాన్ని శృతిహాసన్ స్వయంగా బయటపెట్టింది.

First Published:  13 May 2021 4:12 PM IST
Next Story