Telugu Global
NEWS

అర్ధ‌రాత్రి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పైపులు కోసే రకం చంద్రబాబు..

నాలుగు రోజులు రాష్ట్రం ప్రశాంతంగా కనిపిస్తే.. అర్ధ‌రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి ఆక్సిజన్ పైపులు కోసొచ్చే నికృష్టుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకు కూర్చుంటారని, రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఆయనకు ఉందని ఎద్దేవా చేశారు. “కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాల్లో ప్రజలను […]

అర్ధ‌రాత్రి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పైపులు కోసే రకం చంద్రబాబు..
X

నాలుగు రోజులు రాష్ట్రం ప్రశాంతంగా కనిపిస్తే.. అర్ధ‌రాత్రి వేళ ఆస్పత్రికి వెళ్లి ఆక్సిజన్ పైపులు కోసొచ్చే నికృష్టుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకు కూర్చుంటారని, రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఆయనకు ఉందని ఎద్దేవా చేశారు.

“కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాల్లో ప్రజలను కాపాడుకోవడానికి విభేదాలు మరిచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం. ఎల్లో గ్యాంగు నుంచి అంత గొప్ప ఆలోచన ఆశించలేం. కొన్ని బతుకులంతే.” అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు.

ఇప్పట్లో ఎలక్షన్లేవీ లేవని, అయినా పక్కరాష్ట్రంలో ఉండే చంద్రబాబు, అవసాన దశలో ఉన్న పార్టీని పట్టించుకోకుండా.. కరోనా కష్టకాలంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసి శాడిస్టు, ఆనందం పొందడానికి ఇన్ని వేషాలు వేయాలా..? అని ప్రశ్నించారు. అనవసర రచ్చ ఎందుకు? వ్యాక్సిన్లు తెప్పించగలిగే పరపతి ఉంటే ప్రయత్నించు బాబు అని సలహా ఇచ్చారు.

“రుయా ఘటనను భూతద్దంలో చూపిస్తున్న పచ్చ బ్యాచ్, రమేష్ హాస్పిటల్ లో అగ్నికి ఆహుతైన అభాగ్యుల గురించి, గోదావరి పుష్కరాల్లో బాబు ‘అదృశ్య పాదాల’ కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన 30 మంది గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పడానికి ఏదైనా పాయింటు ఉందా మీ దగ్గర.” అంటూ మండిపడ్డారు.

నారా లోకేష్ పై కూడా ట్విట్టర్ లో సెటైర్లు పేల్చారు ఎంపీ విజయసాయి రెడ్డి. “నక్కపిల్ల పుట్టి 4 వారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాన జీవితంలో చూడలేదన్నదట. చిట్టి నాయుడు వ్యవహారం అలాగే ఉంది. సమీక్షలు, పరిపాలన గురించి సలహాలు ఇచ్చే స్థాయికి నువ్వింకా ఎదగ లేదు మాలోకం. ఇక్కడికొచ్చి ఒక హాస్పిటల్ ను దత్తత తీసుకుని సేవ చేయి. సొల్లు కబుర్లు మానేసి.” అంటూ ఎద్దేవా చేశారు.

First Published:  13 May 2021 7:52 AM IST
Next Story