బన్నీ కూడా క్లబ్ లో చేరిపోయాడు
టాలీవుడ్ లో భారీ పారితోషికం తీసుకునే హీరోలు ముగ్గురంటే ముగ్గురు మాత్రమే. వాళ్లే ప్రభాస్, మహేష్, పవన్ కల్యాణ్. వీళ్ల రెమ్యూనరేషన్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీళ్లు 50 కోట్ల రూపాయలకు పైనే వసూలు చేస్తారు. ఇప్పుడీ లిస్ట్ లోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా 50 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి […]
టాలీవుడ్ లో భారీ పారితోషికం తీసుకునే హీరోలు ముగ్గురంటే ముగ్గురు మాత్రమే. వాళ్లే ప్రభాస్, మహేష్,
పవన్ కల్యాణ్. వీళ్ల రెమ్యూనరేషన్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీళ్లు 50
కోట్ల రూపాయలకు పైనే వసూలు చేస్తారు. ఇప్పుడీ లిస్ట్ లోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా 50 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోతున్నాడు. ఈ సినిమా రెండు
భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి సంబంధించి బన్నీకి రెమ్యూనరేషన్ లేదు.
కేవలం లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడు. అలా 35 నుంచి 40 కోట్ల రూపాయలు ఆర్జించబోతున్నాడు
బన్నీ.
పుష్ప పార్ట్-2కు సంబంధించి మాత్రం నేరుగా 50 కోట్ల రూపాయల్ని పారితోషికంగా తీసుకోబోతున్నాడు.
బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఎమౌంట్ ఇది.
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్. ఒక్కో సినిమాకు అటుఇటుగా
70 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడు. రెండో స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నాడు. ఈ హీరో
అటుఇటుగా 60 కోట్లు తీసుకుంటాడు. మహేష్ కూడా దాదాపు అంతే ఛార్జ్ చేస్తాడు.