Telugu Global
Health & Life Style

కోవిడ్ టైంలో ఇవి వద్దు

కోవిడ్‌ సోకి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నవారు సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కోవిడ్ సోకిన వాళ్లు తీసుకోవాల్సిన ఆహారంతో పాటు తీసుకోకూడని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మసాలాలు: ఘాటుగా ఉండే మసాలా, కారం లాంటివి గొంతులో దగ్గును పెంచుతాయి. అందుకే మసాలా పదార్థాలను కాస్త తగ్గించి కారం కోసం మిరియాలు, పచ్చి మిర్చి లాంటివి వాడడం బెటర్. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌: కోవిడ్ సోకిన వాళ్లు ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా […]

కోవిడ్ టైంలో ఇవి వద్దు
X

కోవిడ్‌ సోకి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నవారు సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కోవిడ్ సోకిన వాళ్లు తీసుకోవాల్సిన ఆహారంతో పాటు తీసుకోకూడని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

మసాలాలు: ఘాటుగా ఉండే మసాలా, కారం లాంటివి గొంతులో దగ్గును పెంచుతాయి. అందుకే మసాలా పదార్థాలను కాస్త తగ్గించి కారం కోసం మిరియాలు, పచ్చి మిర్చి లాంటివి వాడడం బెటర్.

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌: కోవిడ్ సోకిన వాళ్లు ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కోవిడ్ సమయంలో శరీరానికి ఇమ్యూనిటీ అవసరం. కానీ ఇలాంటి ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌లో సోడియంతో పాటు నిల్వ కోసం ప్రిజర్వేటివ్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని తగ్గిస్తాయి.

ఆయిల్ ఫుడ్స్: కోవిడ్ సమయంలో నూనె పదార్థాలు, వేపుళ్లను తగ్గిస్తే మంచిది. ఆయిల్ ఫుడ్స్ వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుని, జీర్ణవ్యవస్థ మీద భారం పెంచుతాయి. ఫలితంగా కోలుకునే వేగం తగ్గుతుంది.

First Published:  12 May 2021 11:59 AM IST
Next Story