హనుమాన్ చాలీసాతో కోవిడ్ దూరం " మధ్యప్రదేశ్ మహిళా మంత్రి
సోషల్ మీడియాలో వచ్చే చిత్ర విచిత్ర వార్తల్లో వేటిని నమ్మాలో, వేటిని నమ్మకూడదో తెలియని గందరగోళంలో పడిపోయాడు సగటు భారతీయుడు. ఎవరో అనామకుడు అవగాహన లేకుండా మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజా ప్రతినిధులు, అందులోనూ కొంతమంది మంత్రులు సైతం కరోనా గురించి అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలి. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో, లేదా ప్రతి సందర్భంలోనూ మతం మత్తులో మునిగిపోతున్నారో తెలియదు కానీ.. బీజేపీ నేతలు కరోనా విషయంలో చేసిన కొన్ని ప్రకటనలు […]
సోషల్ మీడియాలో వచ్చే చిత్ర విచిత్ర వార్తల్లో వేటిని నమ్మాలో, వేటిని నమ్మకూడదో తెలియని గందరగోళంలో పడిపోయాడు సగటు భారతీయుడు. ఎవరో అనామకుడు అవగాహన లేకుండా మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజా ప్రతినిధులు, అందులోనూ కొంతమంది మంత్రులు సైతం కరోనా గురించి అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలి. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో, లేదా ప్రతి సందర్భంలోనూ మతం మత్తులో మునిగిపోతున్నారో తెలియదు కానీ.. బీజేపీ నేతలు కరోనా విషయంలో చేసిన కొన్ని ప్రకటనలు వారి మూఢత్వానికి ఉదాహరణలుగా నిలిచాయి.
మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అందులోనూ ఆమె ఓ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను వేదకాలం నాటి జీవన విధానాన్ని అవలంబిస్తానని, రోజూ హనుమాన్ చాలీసా పఠిస్తానని, అందుకే తనకు కొవిడ్ సోకదని ఆమె చెప్పడం గమనార్హం. ఇప్పటికీ జన సమూహాల్లోకి వచ్చేటప్పుడు ఆమె మాస్క్ పెట్టుకోరు. అదేమని ప్రశ్నిస్తే.. మీరు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అంటూ ఉచిత సలహా ఇస్తారు ఉషా ఠాకూర్.
అంతేకాదు.. కరోనా థర్డ్ వేవ్ ని అడ్డుకోవాలంటే యజ్ఞనం నిర్వహించాలని కూడా సెలవిచ్చారు సదరు మహిళా మంత్రి. అలా చేస్తే పర్యావరణం శుద్ధి అవుతుందని చెబుతున్నారామె. “పూర్వకాలంలో మహమ్మారులను అంతం చేయడానికి యజ్ఞాలు నిర్వహించేవారు. ప్రస్తుత మహమ్మారికీ అదే విరుగుడు. అందుకోసం పర్యావరణాన్ని శుభ్రం చేయాలి. అందుకు మీ సహకారం కావాలి. ఇది ఆచారమో, మూర్ఖత్వమో కాదు. యజ్ఞం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేయగలిగితే థర్డ్ వేవ్ అనేది మన ఇండియా దరి చేరదు” అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.