Telugu Global
Cinema & Entertainment

కమల్ ను కూడా ఇరికించేశాడుగా

ఇండియన్-2 సినిమా వివాదం మొన్నటివరకు ఇద్దరి మధ్యే నలిగింది. తమ సినిమాను కాదని మరో సినిమాకు షిఫ్ట్ అవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. అటు నిర్మాతలతో అంతే స్థాయిలో గొడవ పెట్టుకున్నాడు దర్శకుడు శంకర్. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న ఈ వివాదం ఇప్పుడు కమల్ హాసన్ కు కూడా చుట్టుకుంది. ఇండియన్-2 సినిమా పూర్తి చేయకుండా, మరో సినిమా స్టార్ట్ చేయకూడదంటూ కోర్టు కేసు వేసింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. దీనిపై కౌంటర్ […]

కమల్ ను కూడా ఇరికించేశాడుగా
X

ఇండియన్-2 సినిమా వివాదం మొన్నటివరకు ఇద్దరి మధ్యే నలిగింది. తమ సినిమాను కాదని మరో
సినిమాకు షిఫ్ట్ అవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. అటు నిర్మాతలతో అంతే
స్థాయిలో గొడవ పెట్టుకున్నాడు దర్శకుడు శంకర్. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న ఈ వివాదం ఇప్పుడు
కమల్ హాసన్ కు కూడా చుట్టుకుంది.

ఇండియన్-2 సినిమా పూర్తి చేయకుండా, మరో సినిమా స్టార్ట్ చేయకూడదంటూ కోర్టు కేసు వేసింది లైకా
ప్రొడక్షన్స్ సంస్థ. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాడు శంకర్. అందులో కమల్ ను కూడా
ఇరికించాడు.

సినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి తను ఎంత మాత్రం కారణం కాదని, నిర్మాతలు-కమల్ హాసనే దానికి
కారణమని వాదించాడు శంకర్. మరీ ముఖ్యంగా క్రేన్ యాక్సిడెంట్ తర్వాత కమల్ హాసన్ మేకప్ ఎలర్జీతో
బాధపడ్డారని.. ఆ టైమ్ లో సినిమా మరోసారి వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కరోనా
రావడం, తమిళనాడు ఎన్నికలు రావడం జరిగాయి. ఇలా కమల్, లైకా వల్ల మాత్రమే సినిమా
ఆలస్యమైందని, తన తప్పులేదని వాదించాడు శంకర్.

First Published:  12 May 2021 1:46 PM IST
Next Story