Telugu Global
Health & Life Style

కోవిడ్ తో కంటికి ముప్పు

కోవిడ్ చికిత్స కోసం ఇచ్చే స్టెరాయిడ్స్ తో కంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కంటికి సంబంధించిన సమస్యలను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. కోవిడ్ బారిన పడే వృద్ధ రోగులకు ఇచ్చే స్టెరాయిడ్లు హెర్పెస్ జోస్టర్ ఆప్తాల్మికస్ వంటి కొన్ని వైరల్ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని కంటి నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి కోలుకున్న వారు అందులోనూ ముఖ్యంగా వయసు పైబడిన […]

కోవిడ్ తో కంటికి ముప్పు
X

కోవిడ్ చికిత్స కోసం ఇచ్చే స్టెరాయిడ్స్ తో కంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కంటికి సంబంధించిన సమస్యలను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే..

కోవిడ్ బారిన పడే వృద్ధ రోగులకు ఇచ్చే స్టెరాయిడ్లు హెర్పెస్ జోస్టర్ ఆప్తాల్మికస్ వంటి కొన్ని వైరల్ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని కంటి నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి కోలుకున్న వారు అందులోనూ ముఖ్యంగా వయసు పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని కంటి నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్య అందరికీ ఉండకపోవచ్చని తరచూ కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉండే ప్రమాదముందని నిపుణులు చెప్తున్నారు.

కోవిడ్ వ్యాధి రెటీనా రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు తెలిపారు. వీటిలో ఒకటి ‘రెటినోపతి’ అనే కంటి సమస్య, ఇది ఒక రకమైన రెటీనా వాస్కులర్ వ్యాధి, ఇందులో సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల రెటీనా దెబ్బతింటుంది, ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. అందుకే కోవిడ్ నుంచి కోలుకున్నాక కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

కోవిడ్ నుంచి కోలుకున్న వారు ముఖ్యంగా వయసుపైబడిన వాళ్లు కోలుకున్న తర్వాత దృష్టి మసకబారడం, కళ్లు ఎర్రగా మారడం లేదా నొప్పి వేయడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

First Published:  12 May 2021 10:41 AM IST
Next Story