పుదుచ్చేరిలో మిత్రపక్షానికి షాకిచ్చిన బీజేపీ..!
భారతీయ జనతాపార్టీకి అధికార కాంక్ష ఏ రేంజ్లో పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నది. బీజేపీగానీ దాని మిత్ర పక్షం గానీ అధికారంలో ఉండాలని ఆ పార్టీ నేతలు పన్నాగాలు చేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా పట్టునిలుపుకోవాలని చూస్తున్నది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీని ఒకింత షాక్ కు గురిచేశాయి. పశ్చిమబెంగాల్, కేరళలో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక తమిళనాడు లోనూ ఆ […]
భారతీయ జనతాపార్టీకి అధికార కాంక్ష ఏ రేంజ్లో పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నది. బీజేపీగానీ దాని మిత్ర పక్షం గానీ అధికారంలో ఉండాలని ఆ పార్టీ నేతలు పన్నాగాలు చేస్తున్నారు. అలా దేశవ్యాప్తంగా పట్టునిలుపుకోవాలని చూస్తున్నది.
కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీని ఒకింత షాక్ కు గురిచేశాయి. పశ్చిమబెంగాల్, కేరళలో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక తమిళనాడు లోనూ ఆ పార్టీ మిత్రం పక్షం అన్నాడీఎంకే దెబ్బతిన్నది. అసోం, పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుపొందాయి.
ఇటీవల ఎన్నికలతో తమ బలం పెరిగిందే తప్ప.. తగ్గలేదంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షం సాయంతో అధికార పీఠం చేపడుతున్న బీజేపీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా బలపడుతోంది. నిజానికి బీజేపీకి దక్షిణాదిన పెద్దగా బలంగా ఉండదు. ఒక్క కర్ణాటకలో మినహాయిస్తే ఆ పార్టీకి ఏ రాష్ట్రంలోనూ క్యాడర్ లేదు.
ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. బీజేపీ తన మిత్రపక్షానికి తేరుకోలేని షాక్ ఇచ్చింది.
అక్కడ ఎన్నార్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీచేశాయి. బీజేపీకి ఆరుస్థానాలు, ఎన్నార్ కాంగ్రెస్కు 10 స్థానాలు వచ్చాయి. అన్నాడీఎంకే ఒక్కచోట కూడా గెలవలేదు. అయితే మరో మూడు స్థానాలను కేంద్రప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేస్తుంది. ఇదిలా ఉంటే 10 స్థానాలు గెలుపొందిన ఎన్నార్ కాంగ్రెస్ అధినేత ఎన్.రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆయన రెండు రోజులకే కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు.
ఇది అవకాశంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మొత్తం మూడు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులను బీజేపీకే కేటాయించింది. దీంతో ప్రస్తుతం బీజేపీ బలం పెరిగింది. బీజేపీ ఆరుస్థానాల్లో గెలుపొందగా.. మరో ముగ్గురు స్వతంత్రులు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అంతేకాక మూడు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులతో కలిపి ఆ పార్టీకి బలం 12కు చేరుకున్నది. దీంతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. సీఎం రంగస్వామికి చెందిన ఎన్నార్ కాంగ్రెస్ బలం 10 సీట్లు మాత్రమే.
ఈ పరిణామంతో మిత్రపక్షాలు ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. మూడు నామినేటెడ్ పదవులను తలా ఒకటి చొప్పున కేటాయిస్తారని.. ఎన్నార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే భావించాయి. కానీ మూడు ఎమ్మెల్యేలను కేంద్రం.. బీజేపీకే కేటాయించడంతో మిత్రపక్షాలు షాక్ తిన్నాయి.
భవిష్యత్లో బీజేపీ ఎమ్మెల్యే సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో ఏం జరుగబోతున్నదో వేచి చూడాలి. ప్రస్తుతం రంగస్వామి సీఎంగా ఉన్న బీజేపీ చెప్పినట్టు ఆడవలిసిందే. అందుకుకారణం ఆ పార్టీ చేతిలో ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితులు భవిష్యతుల్లో ఏ పరిణామానికి దారి తీస్తాయే వేచి చూడాలి.