Telugu Global
National

పిల్లలపై వ్యాక్సిన్ పరీక్షలకు అనుమతి !

పిల్లలపైన కోవ్యాక్సిన్ రెండవ, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ని నిర్వహించేందుకు భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి లభించింది. కోవిడ్ 19 పైన పనిచేస్తున్న సబ్జక్ట్ నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెండుమూడు దశల కోవ్యాక్సిన్.. వ్యాక్సిన్ ట్రయల్స్ని రెండు నుండి 18 ఏళ్ల పిల్లలపై నిర్వహిస్తారు. ఢిల్లీ, పాట్నాల్లోని ఎయిమ్స్ హాస్పటళ్లతో పాటు మరికొన్ని హాస్పటళ్లలో మొత్తం 525 మందిపైన ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. పిల్లల విషయంలో కోవ్యాక్సిన్ పనితీరు, భద్రత, రియాక్షన్లు […]

పిల్లలపై వ్యాక్సిన్ పరీక్షలకు అనుమతి !
X

పిల్లలపైన కోవ్యాక్సిన్ రెండవ, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ని నిర్వహించేందుకు భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి లభించింది. కోవిడ్ 19 పైన పనిచేస్తున్న సబ్జక్ట్ నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెండుమూడు దశల కోవ్యాక్సిన్.. వ్యాక్సిన్ ట్రయల్స్ని రెండు నుండి 18 ఏళ్ల పిల్లలపై నిర్వహిస్తారు. ఢిల్లీ, పాట్నాల్లోని ఎయిమ్స్ హాస్పటళ్లతో పాటు మరికొన్ని హాస్పటళ్లలో మొత్తం 525 మందిపైన ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. పిల్లల విషయంలో కోవ్యాక్సిన్ పనితీరు, భద్రత, రియాక్షన్లు మొదలైన అన్ని అంశాలను పరిశీలించేందుకు అనుమతినివ్వాలని భారత్ బయోటెక్ కంపెనీ చేసుకున్న దరఖాస్తుని పరిశీలించిన కేంద్ర ఔషధాల ప్రామాణిక నియంత్రణ సంస్థకు చెందిన కోవిడ్ 19 నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే క్లినికల్ ట్రయల్స్ని నిర్వహిస్తున్న క్రమంలో రెండవ దశ పరీక్షల సమయంలో టీకా భద్రతా ప్రమాణాలకు సంబంధించిన మధ్యంతర సమాచారాన్ని.. డాటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డు చేసిన సూచనలతో సహా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు అందించాలని నిపుణుల కమిటీ కోరింది.

కోవ్యాక్సిన్ ని భారత వైద్య పరిశోధనా మండలి సహకారంతో భారత్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్ల పరిశోధనకు గానీ, అభివృద్ధి గానీ ప్రభుత్వ సహాయ సహకారాలు లేదా గ్రాంట్.. ఏవీ ఇవ్వలేదని, క్లినికల్ ట్రయల్స్ కి మాత్రమే ఆర్థిక సహకారం అందించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టుకి సుప్రీం కోర్టుకి తెలిపింది.

First Published:  12 May 2021 5:17 PM IST
Next Story