కరోనా నుంచి కోలుకున్న బన్నీ
పుష్ప షూటింగ్ టైమ్ లో కరోనా బారిన పడిన అల్లు అర్జున్, ఇప్పుడా వైరస్ నుంచి బయటపడ్డాడు. 15 రోజుల క్వారైంటైన్ తర్వాత తను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు అల్లు అర్జున్ ప్రకటించాడు. “15 రోజుల క్వారంటైన్ తర్వాత కరోనా నెగెటివ్ వచ్చింది. నా కోసం ప్రార్థించిన సన్నిహితులు, అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలంగాణలో పెట్టిన ఈ లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గుతాయని భావిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి.” ఇలా తనకు కరోనా […]

పుష్ప షూటింగ్ టైమ్ లో కరోనా బారిన పడిన అల్లు అర్జున్, ఇప్పుడా వైరస్ నుంచి బయటపడ్డాడు. 15 రోజుల క్వారైంటైన్ తర్వాత తను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు అల్లు అర్జున్ ప్రకటించాడు.
“15 రోజుల క్వారంటైన్ తర్వాత కరోనా నెగెటివ్ వచ్చింది. నా కోసం ప్రార్థించిన సన్నిహితులు, అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలంగాణలో పెట్టిన ఈ లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గుతాయని భావిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి.”
ఇలా తనకు కరోనా తగ్గిపోయిన విషయాన్ని బయటపెట్టాడు బన్నీ. ఈ సందర్భంగా ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశాడు. 15 రోజుల ఐసొలేషన్ తర్వాత తన గది నుంచి బయటకొచ్చిన బన్నీ.. కొడుకు, కూతుర్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much ? pic.twitter.com/ubrBGI2mER
— Allu Arjun (@alluarjun) May 12, 2021